పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ

    Cinema Shootingకడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది.  నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్‌, హీరోయిన్‌ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు.

    పీఎన్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్‌ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్‌రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌ గుడి నుంచి వస్తుండగా హీరో ఆమెను చూస్తూ అందానికి ముగ్దుడై పరవశించే సన్నివేశాన్ని చిత్రీకరించారు.

    చదవండి :  క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందని నాకు సమాచారముంది...

    దర్శకుడు మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ఉండే సమాజం, వాటితీరు తెన్నులు సామాజిక అంశంపై చిత్రాన్ని తీస్తున్నామని తెలిపారు. ఈ సన్నివేశంలో సహనటులు నరశయ్య, శ్రీలక్ష్మి, నీలిమ, అరుణ, చెన్నకేశవరెడ్డి, దండపాణి తదితరులు పాల్గొన్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *