పులివెందులలో అఖిల భారత టెన్నిస్ పోటీలు ప్రారంభం

పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు.

టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, హైదరాబాద్, కేరళ తదతర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు.

పారిశ్రామికవేత్త గంగాధర, స్వామి వివేకానంద పాఠశాల అధిపతి సోమశేఖర్‌రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆదినుంచి పోటీలు ఆసక్తిగా సాగాయి. క్రీడాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.

చదవండి :  గుండెపోటుతో చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి మృతి

సోమవారం జరిగిన ప్రిలిమినరీ రౌండ్లలో గెలుపొందిన విజేతలు:

బాలికల విభాగంలో..

* పులివెందులకు చెందిన లక్ష్మిసాహితీరెడ్డి.. టెన్నిస్‌లో విశేషంగా రాణిస్తూ 5వ స్థానంలో ఉన్న సంజనసిరిమలై (హైదరాబాద్)ను రెండు పాయింట్ల తేడాతో ఓడించింది.

* సుప్రిత్(వైజాగ్)పై లీలా అశ్రిత్(హైదరాబాద్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచింది.

* అర్యపట్లాస్ (ముంబాయి)పై సునీతారెడ్డి(హైదరబాద్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచింది.

* మనోనిత (పులివెందుల)పై అతిథిఆరే (హైదరాబాద్) 6 పాయింట్ల తేడాతో గెలిచింది.

* జాహ్మవి రమేష్(చెన్నై)పై సహస్న సాయి(హైదరాబాద్) 5 పాయింట్ల తేడాతో గెలిచింది.

చదవండి :  నో డౌట్...పట్టిసీమ డెల్టా కోసమే!

* సెన్విల్ దివ్వ (పులివెందుల)పై అమూల్య(హైదరాబాద్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచింది.

బాలుర విభాగంలో..

* రక్షక్‌తరుణ్ (హైదరాబాద్)పై కార్తీక్ కల్యాణ్(హైదరాబాద్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* వేమూరి రామరాజ్(కర్నూలు)పై శివకార్తీక్‌రెడ్డి (పులివెందుల) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* తార్కేష్ అశోకర్ (బెంగళూరు)పై ఆదిత్య (హైదరాబాద్) నాలుగు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* ప్రగతీష్ శివశంకర్ (చెన్నై)పై కార్తిక్‌నీల్(హైదరాబాద్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* సిదార్థరెడ్డి(హైదరాబాద్)పై అక్షిత్(హైదరాబాద్) అయిదు పాయింట్ల తో గెలిచాడు.

* నితీన్‌సాయిపై (వైజాగ్) ప్రత్నోవ్ (బెంగళూరు) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

చదవండి :  విమానాశ్రయంలో జింకల మందలు

* జీఎం రిఖిల్(కొయంబత్తూర్)పై ప్రీయతమ్ (శ్రీకాళహస్తి) ఆరు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* చైతన్య కృష్ణసాయి (హైదరాబాద్)పై జెఫీ రాండీల్(తూతుకుడి) రెండు పాయింట్ల తేడాతో గెలిచారు.

* నితిన్ వర్మ ఇగ్నేష్(చెన్నై)పై ద్రు(వైజాగ్) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* సర్వేష్‌వర్ధన్ (చెన్నై)పై అనురూద్‌రెడ్డి (పులివెందుల) అయిదు పాయింట్ల తేడాతో గెలిచాడు.

* ఆరో నిరంజన్ఎడిషన్ (చెన్నై)పై వెంకట అజయ్ మారెడ్డి(బెంగళూరు)నాలుగు పాయింట్ల తేడాతో గెలిచాడు.

ఇదీ చదవండి!

పులివెందుల రంగనాథ స్వామి

పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము – లగిసెట్టి వెంకటరమణయ్య

పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము ,  రచన: లగిసెట్టి వెంకటరమణయ్య,  ప్రచురణ : 1929లో ప్రచురితం.  …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: