కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం

పసుపు పచ్చని విషం

తెదేపా, ఆ పార్టీ నేతలు, వారికి బాకా ఊదే కరపత్రాలు పదే పదే కడప జిల్లాను, ఇక్కడి సంస్కృతిని, ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యలు చెయ్యటం సర్వ సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పచ్చ పార్టీకి చెందిన పలువురు నేతలు కడప జిల్లా, రాయలసీమల పైన చేసిన విపరీత వ్యాఖ్య/ఆరోపణలను వీక్షకుల సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం…

తేదీ: 03 ఫిబ్రవరి 2023, సందర్భం: మీడియా సమావేశం (అమరావతి) నాయకులు: అచ్చెంనాయుడు

ఆరోపణ :

వైకాపా అధికారంలోకి వచ్చాక ‘రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం’ అమలవుతోంది.

తేదీ: 30 నవంబరు 2020, సందర్భం: అసెంబ్లీ శీతాకాల సమావేశం (అమరావతి) నాయకులు: చంద్రబాబునాయుడు

ఆరోపణ :

నువ్వు అమలు చేయాల్సింది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం. అమలు చేయాల్సింది పులివెందుల పంచాయితీ కాదు, భారత ప్రజాస్వామ్యం.

తేదీ: 28 ఫిబ్రవరి 2020, సందర్భం: విలేఖరుల సమావేశం (అనంతపురం) నాయకులు: కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి

ఆరోపణ :

“వైసీపీ ముసుగులో పులివెందుల రౌడీలు వచ్చి విశాఖలో ఇది ట్రయల్‌ రన్‌ దాడి చూపించారు. మమ్ములను కాదన్నా… మేము చెప్పినట్లు వినకపోయినా ఇదే శాస్తి జరుగుతుంది.. చంద్రబాబుకే దిక్కులేదు… మీకెవరు దిక్కు అంటూ విశాఖ ప్రజలను బెదిరించేందుకు ఈ దాడి చేశారు”

తేదీ: 28 డిసెంబర్ 2019, సందర్భం: విలేఖరుల సమావేశం (ఎన్ఠీఆర్ ట్రస్ట్ భవన్) నాయకురాలు: అనురాధ పంచుమర్తి (తెదేపా అధికార ప్రతినిధి)

ఆరోపణ :

“ఉత్తరాంధ్రాని లూటీ చేయటానికి, దొంగలమయం చేయటానికి, అక్కడ సెటిల్మెంట్లు చేయటానికి, రౌడీయిజం చేయటానికి, పులివెందుల పంచాయితీలు చేయటానికి, ఉత్తరాంధ్ర ప్రజలను అమాయకులను చేసి వాళ్ళను నాశనం చేయటానికి ఈ రోజు ఈ రాజధాని డ్రామా వైసిపి ఆడుతోంది.” (రెఫరెన్సు : https://youtu.be/yL462RVWhy0)

తేదీ: 21 ఆగష్టు 2019, సందర్భం: విలేఖరుల సమావేశం (విజయవాడ) నాయకుడు: దేవినేని ఉమామహేశ్వరరావు (మాజీ మంత్రి)

చదవండి :  జిల్లాకు మలి విడతలో మంత్రి పదవి:వాసు

ఆరోపణ :

“ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థ పాలన చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నారు. “

తేదీ: 24 జులై 2019, సందర్భం: విలేఖరుల సమావేశం (డీవీ మానర్ హోటల్, విజయవాడ) నాయకుడు: చంద్రబాబు (నాటి ఆం.ప్ర. విపక్ష నేత)

ఆరోపణ :

” బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పంచాయితీలు పులివెందులలో కుదురుతాయేమోగానీ అమరావతి, ఇతర ప్రాంతాల్లో కుదరవు. పులివెందుల తరహా పంచాయితీలు జగన్‌ అసెంబ్లీలో కూడా చేస్తున్నారు, జగన్ శాసిస్తారు – స్పీకర్ పాటిస్తారు.. ఇదీ పులివెందుల పంచాయితీ. “

చంద్రబాబు ఆరోపణలను హైలైట్ చేస్తూ తెదేపా సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసిన ప్రకటన.
చంద్రబాబు ఆరోపణలను హైలైట్ చేస్తూ తెదేపా సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసిన ప్రకటన.

తేదీ: 13 జులై 2019, సందర్భం: విలేఖరుల సమావేశం (కాళ్ళకూరు, పశ్చిమగోదావరి జిల్లా) నాయకుడు: కెఎస్ జవహర్ (మాజీ మంత్రి)

ఆరోపణ :

“ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల సంస్కృతిని తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో పొలిటికల్ ఎంకౌంటర్లతో కక్షపూరిత పాలన సాగుతోంది. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి తెలుగుదేశం నేతలను బెదిరిస్తున్నారు.”

తేదీ: 8 జులై 2019, సందర్భం: విలేఖరుల సమావేశం (పొందూరు, శ్రీకాకుళం జిల్లా) నాయకుడు: కూన రవికుమార్‌ (మాజీ విప్‌)

ఆరోపణ :

“ప్రశాంతంగా ఉండే జిల్లాలోకి కడప జిల్లా సంస్కృతిని తీసుకువస్తారా?

తేదీ: 5 మార్చి 2018, సందర్భం: విలేఖరుల సమావేశం (తెదేపా జిల్లా కార్యాలయం, కడప) నాయకుడు: వీరశివారెడ్డి

ఆరోపణ :

పులివెందుల సంస్కృతి వైజాగ్‌లో పురుడు పోసుకుంటుందని భయపడి అక్కడి ఓటర్లు విజయమ్మను ఓడించారు”

తేదీ: 9 జులై 2017, సందర్భం: విలేఖరుల సమావేశం (విజయవాడ) నాయకుడు: దేవినేనిఅవినాష్

ఆరోపణ :

రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు పులివెందుల రౌడీలు ప్రయత్నిస్తున్నారు. అమరావతి నిర్మాణాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే బుద్ది చెబుతారు.”

తేదీ: 26 జనవరి 2017, సందర్భం: విలేఖరుల సమావేశం (విశాఖపట్నం) నాయకుడు: చంద్రబాబు (నాటి ఆం.ప్ర.ముఖ్యమంత్రి)

ఆరోపణ :

‘‘తప్పుడు ప్రచారం చేసి విద్యార్థులను, యువతను జగన్ రెచ్చగొడుతున్నారు. 42 దేశాల నుంచి పెట్టుబడిదారులు విశాఖపట్నం వస్తుంటే వారిని అడ్డుకునేలా ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖను మరో పులివెందుల, కడప చేయాలనుకుంటున్నారా?

చదవండి :  ముత్తులూరుపాడు

తేదీ: 18 డిసెంబర్ 2016, సందర్భం: విలేఖరుల సమావేశం (తెదేపా రాష్ట్ర కార్యాలయం, గుంటూరు) నాయకుడు: యరపతినేని శ్రీనివాసరావు (నాటి శాసనసభ్యుడు, గురజాల)

ఆరోపణ :

“పులివెందుల సంస్కృతిని పల్నాడులో ప్రదర్శించాలని చూస్తే సాగదు”

తేదీ: 28 మే 2016, సందర్భం: తెదేపా మహానాడు (తిరుపతి) నాయకుడు: చంద్రబాబు (నాటి ఆం.ప్ర.ముఖ్యమంత్రి)

ఆరోపణ / ఎగతాళి :

“రాష్ట్రంమొత్తం మీద సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాము. అంతేకాకుండా రౌడీషీటర్లు ఫోటోలు, వేలి ముద్రలతో సహా పెట్టిస్తున్నాము. ఎవరైనా రౌడీ షీటర్ ఈ ప్రాంతానికి వస్తే రెండు నిమిషాల్లో మనకు అలర్ట్ వస్తుంది. పలానా పులివెందుల రౌడీ ఇక్కడికి వచ్చాడంటే తక్షణమే పోలీసులు వారిని వెంబడిస్తారు”

తేదీ: 12 ఫిబ్రవరి 2016, సందర్భం: విలేఖరుల సమావేశం, నెల్లూరు (ఆనం రాంనారాయణ స్వగృహం) నాయకుడు : ఆనం వివేకానందరెడ్డి

ఆరోపణ :

“తునిలో జరిగిన కాపు గర్జనలో కడప జిల్లాకు చెందిన అనేకమంది రౌడీలు చొరబడి ముఖాలకు గుడ్డలు ధరించి రైలును దహనం చేశారు.”

తేదీ: 1 ఫిబ్రవరి 2016, సందర్భం: విలేఖరుల సమావేశం, గుంటూరు (క్యాంపు ఆఫీసు) నాయకుడు: చంద్రబాబు (నాటి ఆం.ప్ర.ముఖ్యమంత్రి)

ఆరోపణ :

“ప్లాన్ చేసి ఇంత దుర్మార్గమైన చర్య ఏ పులివెందులలోనో జరిగిందంటే వి కెన్ అండర్ స్టాండ్, బట్ నాట్ ఇన్ ఈస్ట్ గోదావరి – బట్ నాట్ ఇన్ తుని”

తేదీ: 3 ఏప్రిల్ 2015, సందర్భం: పారిశ్రామిక వాడలో శంకుస్థాపన (సత్యవేడు) నాయకుడు : చంద్రబాబు (నాటి ఆం.ప్ర.ముఖ్యమంత్రి)

ఆరోపణ :

శాంతిభద్రతలు అదుపులో లేకపోతే పరిశ్రమలు రావు, అందుకు కడప జిల్లాయే ఉదాహరణ

తేదీ: 1 జనవరి 2015, సందర్భం: కొత్త సంవత్సర వేడుకలు (తుళ్ళూరు, గుంటూరు జిల్లా) నాయకుడు: చంద్రబాబు (నాటి ఆం.ప్ర.ముఖ్యమంత్రి)

ఆరోపణ :

“టీడీపీ ఓడిపోయి ఉంటే రాజధానిని ఇడుపులపాయకు తరలించుకు పోయేవారు. కొంతమందికి ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేదు. అందుకే రాజధానికి ఇంత భూమి ఎందుకంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొంతమంది బెదిరించి భూముల విలువ పోగొట్టేలా చేస్తున్నారు. కడప రాజకీయాలు ఇక్కడ సాగవు. ప్రశాంత నగరమని, గొడవలు లేని చోట గొడవలు పెడతారా? కడప,కర్నూలులో,ముఖ్యంగా కడపలో చీని తోటలు నరికేస్తుంటారని,ఇక్కడ మాత్రం వాళ్ల ఆటలు సాగవు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి”

చదవండి :  విశ్వవ్యాప్తంగా కడప నారాయణదాసు సంకీర్తనలు

తేదీ: 01 ఏప్రిల్ 2008, సందర్భం: ఆం.ప్ర శాసనసభ సమావేశాలు (హైదరాబాదు) నాయకుడు : దేవేందర్ గౌడ్ (తెదేపా శాసనసభ్యుడు)

“పులివెందులకు అయితే 6 లైన్ల రోడ్లు కావాలి. పులివెందుల టు కడప 8 లైన్ల రోడ్లు కావాలి. హైమ్యాక్స్ లైట్లు కావాలి, రింగు రోడ్డు కావాలి, డ్రైనేజీ కావాలి. మీ నియోజకవర్గ ప్రజలకు మా మీద పెత్తనం చలాయించే అధికారం ఎవరిచ్చారు? వాళ్లకి ఏ విధమైన స్పెషల్ గ్రాంట్ ఇవ్వటానికి ఏ అధికారం ఏ విధంగా ఇచ్చినారు”

తేదీ: 31 మార్చి 2008, సందర్భం: ఆం.ప్ర శాసనసభ సమావేశాలు (హైదరాబాదు) నాయకుడు : చంద్రబాబు (నాటి ఆం.ప్ర. విపక్షనేత)

ఆరోపణ :

“రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మర్చాలనుకుంటున్నారు. ఇంకొక పక్క ముఖ్యమంత్రి గారి నేటివ్ ప్లేస్ పులివెందుల నుంచి ఫ్యాక్షన్ లీడర్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.  పులివెందుల వారి దౌర్జన్యం శృతిమించి పోతోందని, రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసే పరిస్థితి వచ్చింది. హ్జైదరాబాదులోనే కాదు విశాఖపట్నం, విజయావాడ, తిరుపతి, నెల్లూరు మొత్తం పోయి, వాళ్ళు అక్కడ స్వైర విహారం చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడకుంటే ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హులో ఆలోచించండి.”

ఆధారం (శాసనసభ ప్రొసీడింగ్స్)

పచ్చని విషం

 

తేదీ: 28 మార్చి 2008, సందర్భం: ఆం.ప్ర శాసనసభ సమావేశాలు (హైదరాబాదు) నాయకుడు : నాగం జనార్ధనరెడ్డి (శాసనసభ్యుడు)

ఆరోపణ :

“రంగారెడ్డి జిల్లాలో పులివెందుల నుంచి వచ్చిన వారిని చూసి ప్రజలు వణికిపోతున్నారు.”

 

ఇదీ చదవండి!

నీటిమూటలేనా?

పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?

శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: