netball

అండర్-16 జాతీయ నెట్‌బాల్ పోటీలకు మనోళ్ళు

సిద్దవటం ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పి.శైలజ, జగదీశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రవిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు రెడ్డెయ్య తెలిపారు.

ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు బాలికల విభాగంలో శైలజ, బాలుర విభాగంలో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. నవంబర్ 1 న విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలో వీరు ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు.

చదవండి :  కలివికోడి కోసం ...

జాతీయ పోటీలకు అర్హత సాధించిన శైలజ, జగదీశ్వర్‌రెడ్డిలకు

www.www.kadapa.info అభినందనలు తెలియచేస్తోంది!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: