
నీళ్ళకు బోర తిమ్మ – జానపదగీతం
వర్గం: పిల్లల పాట
నీళ్ళకు బోర తిమ్మ
నిద్దరొస్తాదమ్మ
కట్టెలు తేరా తిమ్మ
కడుపు నస్తాదమ్మ
నట్టుకు బోర తిమ్మ
నడుము నస్తాదమ్మ
పిన్నె దీసుకోర తిమ్మ
ఇంతె సాలు మాయమ్మ
సేనికి బోర తిమ్మ
సినుకులొస్తాయమ్మ
ఇంట్లో పడుకోర తిమ్మ
ఇంతె చాలు మాయమ్మ
పాడినవారు: వడ్లూరి నారాయణరెడ్డి, రాకట్ల, రాయడుర్గము తాలూకా, అనంతపురం జిల్లా