దొరవారి నరసింహ్వరెడ్డి

దొరవారి నరసింహ్వరెడ్డి! – జానపదగీతం

దొరవారి నరసింహ్వరెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహ్వ రెడ్డి! || దొర ||

రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి || దొర ||

కొయిల్ కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డూలెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||

కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర ||

చదవండి :  ఆ.. మాటలంటదే కోడిపిల్ల...! - జానపదగీతం

కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోటా బురుజుకూ గట్టీరీ || దొర ||

కాసిలోనా తల్లికేమో చావు సుద్దీ దెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే || దొర ||

పాడినవారు : దూదేకుల బాబయ్య  ఉరఫ్ సిరెప్ప
సూరేపల్లి, తాడిపత్రి తాలూకా, అనంతపురం జిల్లా

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే …

ఒక వ్యాఖ్య

  1. Wonderful collection of Folk songs. Let us colect and publish all the songs of yesteryears which tells us about our past culture and people .. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: