
దేశం గూటికి చేరిన మేడా మల్లికార్జునరెడ్డి
వైకాపా తరపున రాజంపేట శాసనసభ సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జ్ మేడా మల్లికార్జున రెడ్డి చివరకు తెలుగుదేశం గూటికి చేరారు. ఆదివారం హైదరాబాదులో పసుపు దళపతి చంద్రబాబు సమక్షంలో మేడా సైకిలేక్కారు. దీంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అవకాశాలు మెరుగయ్యాయి.
మేడా మల్లి కార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ రాజం పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బ్రహ్మయ్యతో కలిసి వెళ్లి పార్టీలో చేరారు. వీరు ఇరువురితో పాటు మిగతా నేతలతో సమన్వయం కుది రితే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ వైకాపాకు గట్టి పోటీ ఇవ్వవచ్చు.ఇప్పుడున్న పరిస్తితులలో పార్టీలో సీటు ఆశిస్తున్న వారు సర్దుకోవడం కష్టమే కావచ్చు.
2012లో జరిగిన ఉపఎన్నికల్లో మేడా మలి ్లకార్జునరెడ్డికి 39 వేల ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బ్రహ్మయ్యకు 21వేల ఓట్లు వచ్చాయి.