టీడీపీకి 25 ఓట్లు, వివేకాకు 10 ఓట్లు

Chandra Babuలింగాల మండలం కోమన్నూతల గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌ల్లో టీడీపీకి 25ఓట్లు వచ్చాయి. … ఇటీవల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుపై రాళ్ళు విసిరి ఈ గ్రామస్తులు వార్తల్లోకెక్కారు.ఎన్నికల  ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు జగన్ అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బాబు ప్రసంగానికి అడ్డుతగలడం, తెలుగు దేశం, వై.ఎస్‌.ఆర్‌ కార్యకర్తల మద్య మాటల యుద్దం,చంద్రబాబు వాడివాడి వాగ్దానాలు సందించడం తో రెచ్చిపోయిన వై.ఎస్‌.ఆర్‌ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు, బురద మట్టితో దాడి చేయడం, ఇందుకు ప్రతిగా తెదేపా కార్యకర్తలు కూడా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై బాటిళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే…

చదవండి :  జగన్ మెజార్టీ 5,45,672 ఓట్లు

ఈ నేపధ్యంలో కోమన్నూతలలో తెదేపాకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ఆసక్తికరమైన అంశం.

అలాగే లింగాల మండలంలోని మరో గ్రామం అంబకపల్లెలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేవలం 10ఓట్లు మాత్రమే దక్కించు కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు దొరకపోవడంతో ఇప్పట్ల నుంచి కొందరిని తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చోబెట్టారు.

ఇదీ చదవండి!

go34

సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: