జూన్ ఆఖరుకు కడప విమానాశ్రయం సిద్ధం
-
విమాన సర్వీసులను నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న పలు విమానయాన సంస్థలు
-
ఆగస్టు 15 నుంచి సర్వీసుల ప్రారంభం?
కడప: మీరు కడప నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మరో నాలుగు నెలలు ఆగండి. తిరుపతికే కాదు… కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, న్యూఢిల్లీలాంటి మహానగరాలకూ వెళ్చొచ్చు. కడపలో కొత్తగా నిర్మించబోయే ఏయిర్‌పోర్టు పనులు చివరి దశలో ఉన్నాయి. జూన్ చివరికల్లా విమానాల రాకపోకలకు ‘కడప ఏయిర్‌పోర్టు’ సిద్ధంగా ఉంటుంది.
అయితే ప్రభుత్వం మాత్రం ఆగస్టు 15 నుంచి సర్వీసులను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కడపలో 1953 నుంచి విమానాశ్రయం ఉన్నప్పటికీ విమానాల రాకపోకలు మాత్రం పూర్తిస్థాయిలో లేవు. దీంతో కడపలో సకల సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఇందుకోసం రూ.33 కోట్ల నిధులను ఒకే విడతగా విడుదల చేశారు. దీంతో 1060 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. రెండు విడతల్లో ఏయిర్‌పోర్టు నిర్మాణ పనులను చేపట్టారు.
మొదటి విడత పనులు పూర్తి:
మొదటి విడత పనులను రూ.21 కోట్లతో 2008 జూన్‌లో చేపట్టారు. 2009 డిసెంబర్‌కు పనులను పూర్తి చేశారు. ఇందులో 6వేల అడుగల రన్‌వేతో పాటు ఆఫ్రాన్, టాక్సీతో పాటు 1060 ఎకరాల పరిధికి రక్షణ గోడ నిర్మించారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. రూ.13 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో టెర్మినల్ బిల్డింగ్ తో పాటు ఏటీసీ( ఏయిర్ ట్రాఫిక్ సర్వీసు), పవర్ హౌస్, లింకు రోడ్డులు, కార్‌పార్కింగ్‌తో పాటు సివిల్, ఎలక్ట్రికల్ పనులను చేపట్టారు. రెండో విడత పనులు 2011 డిసెంబరుకే పూర్తి కావల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో గడువు జూన్ వరకు వాయిదా పడింది.
ప్రస్తుతం టెర్మినల్ బిల్డింగ్ పూర్తి అయింది. గ్లాస్ వర్క్, విద్యుత్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. వచ్చే నెల 15లోపు అన్ని హంగులతో టెర్మినల్ బిల్డింగ్ సిద్ధమవుతుందని ఏయిర్‌పోర్ట్ అధికారులు అంటున్నారు. టెర్మినల్‌కు దగ్గరలోనే కార్‌పార్కింగ్ పనులు కూడా చేపడుతున్నారు. దీంతో పాటు టెర్మినల్,ఇన్‌వే, అవుట్‌వే లింకు రోడ్లను కూడా నిర్మిస్తున్నారు. వీటి పనులు కూడా చురుగ్గానే సాగుతున్నాయి. టెర్మినల్‌కు సమీపంలోనే టవర్ పనులు కూడా చేపడుతున్నారు. ఇవి కూడా చివరి దశలో ఉన్నాయి. జూన్ ఆఖరుకు నిర్మాణపు పనులు పూర్తవుతాయి. జూలై నుంచి విమానాల రాకపోకలు జరగొచ్చని ఏయిర్‌పోర్టు అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆగస్టు 15 నుంచి కడప నుంచి విమానసర్వీసులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వానికి పలు విమాన సంస్థల దరఖాస్తులు:
కడప నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ఏయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. కింగ్‌ఫిషర్, జెట్ ఏయిర్ వేస్, స్పైజెట్‌లు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఏయిర్ లైన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి. అయితే కడప విమానాశ్ర యాన్ని డొమెస్టిక్ ఏయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులు మాత్రమే సౌకర్యం ఉంటుంది. బోయింగ్, ఏయిర్ బస్సులు నడిపేందుకు కడప ఏయిర్‌పోర్టు రన్‌వే సరిపోదు.
అన్ని వర్గాల వారికీ సౌలభ్యం:
పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో జిల్లా పురోగతిని సాధించడంతో విమానసౌకర్యం అనివార్యమైంది. రిమ్స్‌లో వైద్యుల రాకపోకలు, యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, యర్రగుంట్ల సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారులు కూడా కడప నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారలావాదేవీల కోసం తరచూ వెళుతున్నారు. వీరందరికీ కడప ఏయిర్‌పోర్టు సౌలభ్యంగా ఉంటుంది. దీంతో పాటు కడప నుంచి ‘కనెక్టింగ్ ఫ్లైట్’లు నడపనున్నారు. దీంతో కడప నుంచి ఏ ప్రాంతానికైనా టిక్కెట్టు తీసుకుని ప్రయాణించవచ్చు. అయితే ఇతర ఏయిర్‌ఫోర్టులలో విమానం మారాల్సి ఉంటుంది.
జూన్ ఆఖరుకు ఏయిర్‌పోర్టు సిద్ధం: ఆర్. ఠాగూర్, ఏజీఎం
జూన్ ఆఖరుకు విమానాశ్రయాన్ని రాకపోకలకు సిద్ధం చేస్తాం. జూలై నుంచి సర్వీసులను నడిపేందుకు వీలుగా అన్ని వసతులను కల్పిస్తున్నాం. ఇప్పటికే పలు విమాన సంస్థలు సర్వీసులు నడిపేందుకు ఏయిర్‌పోర్ట్ అథారిటికి దరఖాస్తు చేసుకున్నాయి
4 Comments
ఆహా! ఇన్నేళ్ళ ఎదురుచూపులు ఫలించనున్నాయన్నమాట. కడప విమానాశ్రయం బ్రిటిష్ పాలనాకాలంలో కట్టిందనుకుంటున్నాను. కాదా? ఏమైనప్పటికీ పీవీ హయాంలో పూర్తిగా మూతపడిన మన విమానాశ్రయం ఇరవయేళ్ళ తర్వాత ఇప్పటికైనా సిద్ధం కావడం సంతోషకరం. కనెక్టింగ్ ఫ్లైట్లకు మాత్రమే సరిపోయే ప్రస్తుత రన్ వేను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా విస్తరించినట్లైతే బాగుండేది.
VERY HAPPY I WAITING FOR FLIGHTS
E PROJEST CHALA DAYS NUMDI PENDING LO VUMDI MA YSR CM AINA TARUVATA CONFOMGA AIRPORT VASTUMDI ANUKUNA BUT SIR VELIPOYARU BAD LUCK EPATIKANA E GOVT INTREST THO WORK NU COMPLATE CHEYADAM HAPPY GA VUNDI
THANKS FOR COLLECTAR
I am happy to read this news but so far I am not sure they are going to operate this air port on 15th aug let us see when it is happening.Bur I could not notice one thing that they forget totally NRI who are working in Gulf at present they are using Chennai airport so if commericial airliner arrange connecting flight to which arriving from Gulf for example from KUWAIT to CHENNAI but infact passenger have to reach Kadapa and from Kadapa to Chennai to have connecting flight to KUWAIT.So if domastic airliner made this arrangement wiith international airliners which are arriving from Gulf.From both sides buiness will have as well as passenger have best comfortable journey with out any harassment of Chennai police.Please do consider my suggestion please implement it for benifit of KADAPA NRI happyness.Thanks and regards.Mr. Abubaker from KUWAIT.