జిల్లాలో బస్సు సర్వీసుల నిలిపివేత
కడప : జిల్లాలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే కడప నుండి హైదరాబాద్ కు చేరుకునే బస్సులను రద్దు చేస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారుల ఆదేశాలతోనే ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కడప పులివెందుల బస్సులను కూడా నిలిపెసినట్లు సమాచారం. ఇదంతా జగన్ అరెస్టు సమాచారం మేరకే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీస్తోంది.