జగన్ అఫిడవిట్ సహేతుకం: నామినేషన్‌ను ఆమోదించిన ఈసీ
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కొక్క గండాన్ని అధిగమించి ముందుకు సాగుతున్నారు. కడప పార్లమెంట్ సీటుకు రాజీనామా చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ జగన్ నామినేషన్ ఘట్టానికి చేరుకున్నారు.
ఆయన నామినేషన్ల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులున్నాయంటూ ఆయన ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక ఆస్తులను ఆయన చూపించలేదని అందువల్ల ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా అనర్హుణ్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయమై నేటి నామినేషన్ల పరిశోదనలో కూడా వాదోపవాదాలు సాగాయి. తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు జగన్ అఫిడవిట్‌పై అభ్యంతరాలు లేవనెత్తగా, జగన్ తరపున న్యాయవాదులు ప్రతివాదన చేశారు.
చివరకి రిటర్నింగ్ అధికారి జగన్ నామినేషన్‌ను ఆమోదించడంతో జగన్ అనుచరలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కడప లోక్‌సభకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఇద్దరు నామినేషన్లు చెల్లవని, పులివెందులలో నామినేషన్లు దాఖలు చేసిన మరో ఐదుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లు చెల్లవని తిరస్కరించారు.