చెయ్యరానిచేతల

చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3

చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు…

వర్గం : శృంగార సంకీర్తన
రాగము: సామంతం
రేకు: 1354-5
సంపుటము: 23-323

చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా
చేయం టేవు గండికోట చెన్నకేశ్వరా ॥పల్లవి

చదవండి :  కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

బగ్గన నీవు నాపయ్యద వట్టి తియ్యఁగా
సిగ్గులువడఁగరాదా చెన్నకేశ్వరా
వొగ్గి యెవ్వతోమెట్టెలు వొట్టి నావేలఁ బెట్టఁగ
యెగ్గులువట్టఁగరాదా ఇటు చెన్నకేశ్వరా ॥చెయ్యరాని

సిరులతో నీవు నన్నుఁ జెనకులు చెనకఁగా
శిరసైన నూఁచరాదా చెన్నకేశ్వరా
తెరలోనఁ బెట్టుకొన్న తెరవను మొక్కించఁగ
వొరిమఁ దిట్టఁగరాదా వో చెన్నకేశ్వరా ॥చెయ్యరాని

వేవేలుగా మన్నించివేడుకపడఁగా నీకు
సేవలు సేయఁగరాదా చెన్నకేశ్వరా
యీవల శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
తావుకొని మెచ్చరాదా తగుచెన్నకేశ్వరా ॥చెయ్యరాని

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుచేయి - అన్నమయ్య సంకీర్తన

ఇదీ చదవండి!

ఏమి నీకింత బలువు

ఏమి నీకింత బలువు – పెదతిరుమలయ్య సంకీర్తన

తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: