గాలినే పోయఁ గలకాలము

కన్నడ గౌళ
॥పల్లవి॥
గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు
read
॥చ1॥
అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు
॥చ2॥
కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
కలుషదేహపుబాదఁ గలకాలము
తలపోసి తనపాలిదైవమైనహరి
దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు
॥చ3॥
శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు
రాగము: తెలియదు
రేకు: 0003-01
సంపుటము: 1-14

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు

చదవండి :  అలరఁ జంచలమైనఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: