కోరవాని పల్లెలో గొర్రెల కాపరుల వింత ఆచారం
గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలు చేసి జంతు బలులు ఇచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలోని వేలాది గొర్రెలను రంగుల ముగ్గులపై నడిపించారు. ముగ్గుల పై గొర్రెలను నడిపిస్తే గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉంటాయని గొర్రెల కాపరుల నమ్మకం!
2 Comments
sheep protect act ont aplicabulin this insident ?
please don’t menssion gorrela kaparulu , please mention mension yadavas