కులాల పేర్లు

కడప జిల్లాలో కులాల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం …

ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6)

ఈడిగ – ఈడిగపల్లె (17)

ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు

ఏకరి – ఏకర్లపాలెం

వడ్డె – వడ్డిల్లు, వడ్డిండ్లమిట్ట (2), వడ్డె అగ్రహారం, వడ్డెపల్లె (57), వడ్డెపాలెం (2), వడ్డెవాండ్లపల్లె, వడ్డెవారిపల్లె

కంసాలి (ప. వడ్ల) – కంసలపల్లె, కంసలవాండ్లపల్లె, కంసలవారిపల్లె, వడ్లవాండ్లపల్లె (2)

కమ్మ (పర్యాయ పదం : నాయుళ్ళు) – కమ్మగుట్టపల్లె, కమ్మపల్లె (10), కమ్మపాలెం, కమ్మవారిపల్లె (5), కమ్మవారి బ్రాహ్మణపల్లె, నాయునిఎర్రపల్లె, నాయునిపల్లె (2), నాయునివాండ్లపల్లె, నాయునివారిపల్లె (10), నాయుని వారి సుగాలితాండ

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

కాపు (పర్యాయపదం : రెడ్లు) – కాంబల్లె (2), కాపుపల్లె (2), రెడ్డికొట్టాల, రెడ్డిగారిపల్లె (8), రెడ్డినగరం, రెడ్డిపల్లె (5), రెడ్డిపల్లె పేట, రెడ్డిమల్లువాండ్లపల్లె, రెడ్డివారిపల్లె (30), కొడిదెపల్లె (రెడ్లలో ఒక శాఖ కొడిదె)

కుమ్మర – కుమ్మరపల్లె (23), కుమ్మరరావులపల్లె, కుమ్మరవాండ్లపల్లె, కుమ్మరవానిపల్లె, కుమ్మరవారిపల్లె (3), కుమ్మరకొట్టాలు

కోమటి (పర్యాయపదం : శెట్లు) – కోమటికుంట,కోమటిపల్లె, కోమటిపేట, కోమన్నూతల, శెట్టిగుంట, శెట్టిపల్లె, శెట్టివాండ్లపల్లె (2), శెట్టివారిపల్లె (4)

గాండ్ల (పర్యాయపదం : తెలగ ) – గాండ్ల తిమ్మాయపల్లె, గాండ్లపల్లె (7), గాండ్లవాండ్లపల్లె, గాండ్లవారిపల్లె, తెలగాపురం

తెలికి – తెలికి

గాజుల – గాజులపల్లె (2), గాజులపేట (2)

గూడ – గూడావాండ్లపల్లె

గొరగ – గొరిగెనూరు

గొల్ల (పర్యాయపదం : యాదవ, రేడు) – గొల్లఓబాయపల్లె (33), గొల్లబాలసానివాండ్లపల్లె, గొల్లలఉప్పలపాడు, గొల్లలగూడూరు, గొల్లవాండ్లపల్లె (2), గొల్లవారిపల్లె (2), యాదవకుంట, యాదవరాజుపల్లె, యాదవాపురం (2),  రేపల్లె (4)

చదవండి :  మల్లెమాల పురస్కారం అందుకున్న నరేంద్ర

గౌడు – గౌనివాండ్లపల్లె

చాకలి – చాకలపల్లె, చాకలవాండ్లపల్లె, సాకిబండ లేదా చాకిబండ

జంగం – జంగంపల్లె (8), జంగాలపల్లె (4)

జోగి – జోగాపురం

తంబల్లు – తంబల్లగొంది, తంబల్లవారిపల్లె

తొగట – తొగటపల్లె (3)

దాసరి – దాసరిపల్లె (3), దాసరివాండ్లపల్లె

దూదేకుల – దూదేకులపల్లె (4), దూదేకులపాలెం

దొమ్మర – దొమ్మరనంద్యాల

మేదర – మేదరపల్లె

నేదర – నేదరపేట

పంబల – పంబలపల్లె

పిచ్చిగుంట్ల –   పిచ్చిగుంట్ల (6), పిచ్చిగుంట్లవాండ్లపల్లె

పూసల – పూసలకొట్టాలు

పైడి – పైడిపాలెం

బలిజ – బలిజపల్లె (17)

బింగి – బింగివాండ్లపల్లె

బెస్త – బెస్తపల్లె (10), బెస్తవారిపల్లె, బెస్తవేముల

బేరి – బేరిపల్లె (3)

బైనేని – బైనేనివాండ్లపల్లె

చదవండి :  ప్రొద్దుటూరు పట్టణం

బొందిలి – బొందలకుంట, బొందిల్లపల్లె

బోగం – బోగంపల్లె

బోయ – బోయపల్లె (5), బోయిల్లవారిపల్లె, బోళ్ళగొందిచెరువు

బ్రాహ్మణ (పర్యాయపదం : అయ్యవార్లు) – బ్రాహ్మణ ఎర్రగుడి, బ్రాహ్మణపల్లె (5), అయ్యవారి కంబాలదిన్నె, అయ్యవారిపల్లె (8), అమ్మగారిపల్లె, అమ్మయ్యగారిపల్లె (2)

భట్రాజులు – భట్టువారిపల్లె, భట్రాజులపల్లె, బొట్లచెరువు, భట్ల ఒంటిపల్లె

మంగళ – మంగళపల్లె (8), మంగళవాండ్లపల్లె, మంగలివారిగరుగుతాండ

మరాటి – మరాటిపల్లె (2)

ముత్తరాచ – ముత్తరాచుపల్లె (3)

మొండి – మొండిండ్లు

రాచ (పర్యాయపదం : క్షత్రియ) – రాచగొల్లపల్లె, రాచపల్లె (21), రాచపాలెం, రాచవారిపల్లె (2), రాజుకుంట, రాజుపల్లె (2), రాజుపాలెం (12), రాజుపేట (2), రాజువారిపల్లె (2), రాజువారిపేట

వెలమ – వెలమవారిపల్లె (2)

సాతాని – సాతానిపల్లె

సాతు – సాతపల్లె

సాలె – సాలెవారి ఉప్పలపాడు

సింగం – సింగంవాండ్లపల్లె

ఇదీ చదవండి!

ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు పట్టణం

ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు (ఆంగ్లం: Proddatur లేదా Proddutur), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: