మాటలేలరా యిక మాటలేల

కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు.

వర్గం: శృంగార సంకీర్తన
రేకు: 587-4
సంపుటము: 13-458
రాగము: సాళంగనాట


‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

కాదనకు నామాట కడపరాయ – నీకు
గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥

కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ
గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో
కప్పుమివే కుచములు కడపరాయా-వో
కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ ॥కాదనకు॥

చదవండి :  కప్పురమందుకొంటిఁ గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

కందువకు రారాదా కడపరాయా-ముందే
గందమిచ్చినవాఁడవు కడపరాయ
కందము నీమాటలిఁక గడపరాయా-వో
కందర్పగురుఁడ మొక్కేఁ గడపరాయ ॥కాదనకు॥

కలసితివిటు నన్నుఁ గడపరాయా-నా
కల నేఁడు నిజమాయఁ గడపరాయ
కలదాననే నీకుఁ గడపరాయా-వో
కలికి శ్రీవేంకటాద్రి కడపరాయా ॥కాదనకు॥


‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

ఇదీ చదవండి!

సింగారరాయుడ

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: