విమానాశ్రయం కథ మళ్ళా మొదటికే!

కడప విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా పడింది. ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రచారం జరగడం, అధికార పార్టీ నేతలు కూడా పోటీపడి ఆ మేరకు ప్రకటనలు చేయడం, మీడియాలో కూడా ఈ వార్తలు ఊపందుకోవడంతో ఈ సారి తప్పక ప్రారంభమవుతుందని అంతా ఆశించారు. ఈ మేరకు విమానాశ్రయంలో సన్నాహాలు కూడా చేశారు. ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి రెండు మూడు రోజులుగా రెండు మూడు లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఖర్చు చేశారు.

తీరా శుక్రవారం విమానాశ్రయ ప్రారంభం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు కాని వివరణ ఇవ్వలేదు.

చదవండి :  'ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో చెప్పాల'

అంతేకాదు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇదేమంటే ఎయిర్‌పోర్టులో రన్‌వే  8 సీటర్‌ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా అయితే 72 సీటర్‌ విమానాలు దిగే స్థాయిలో రన్‌ వే నిర్మించారని మొదటి నుంచి చెపుతూ వచ్చారు. సాంకేతికంగా ఈ రన్‌ వే నిర్మాణం ఎంత సామర్ధ్యంతో నిర్మించారన్నది అధికారులు వెల్లడించాల్సి ఉంది.

విమానాశ్రయం, రన్‌ వే పనులు పూర్తయి మూడేళ్లు పైబడింది. మరి ఇంత కాలం ఈ రన్‌ వే ఎన్ని సీటర్ల కెపాసిటీ విమానాలు దిగే స్థాయిలో నిర్మించారన్నది ఎయిర్‌ ఇండియా అథారిటీ అధికారులు గమనించలేదా… ఎయిర్‌ అథారిటీ అధికారులు పలుసార్లు ఈ పనులు పరిశీలించి కూడా వెళ్లలేదా.. అలాంటప్పుడు రన్‌ వే గురించి పరిశీలన జరగలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతెందుకు… విమానాశ్రయం పనులు ప్రారంభించేందు కోసం ముందుగానే టెర్మినల్‌ డైరెక్టర్‌ను నియమించారు.

చదవండి :  ఆశలన్నీ ఆవిరి

సిఎం రమేష్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి విమానాశ్రయ ఫోటోలు తెప్పించుకుని పరిశీలించారని కూడా చెప్పారు. కేంద్ర మంత్రి కూడా ప్రారంభానికి వస్తున్నారని ప్రకటించారు. ఇవేమీ తెలియకుండానే ప్రారభోత్సవ ఏర్పాట్ల వరకూ వెళ్ళారా? కడప విమానాశ్రయం ప్రారంభించడం ఇష్టం లేకనే ప్రభుత్వ పెద్దలు ఇలా లీకులిప్పించారని ఒక పుకారు షికారు చేస్తోంది.

ఏది ఏమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఏఏఐ గానీ అధికారికంగా వివరాలు తెలియచేస్తే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.

చదవండి :  కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

ఇదీ చదవండి!

కడప బెంగుళూరు విమానాలు

కడపకు తొలి విమానమొచ్చింది

కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( …

ఒక వ్యాఖ్య

  1. Every body know the reason why Chandra babu stoped the opeining of Kadapa airport because he does not like Kadapa,and Kadapa should not be first in openining ceromony, after becomie separate state.He want either Chitoor or coastal district should be first,and he does not like Kadapa because it is belong to YSR and Kadapa name is YSR district.So Chandra babu openly will not do any hinders to Kadapa but he do best to stop every thing Kadapa inderectly.This is the hidden secret, not to open Kadapa airport.So my dear friends is it clear reason now why Chanra babu stoped the opening ceromony of KADAPA AIRPORT. THANKS AND REGARDS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: