కడప విమానాశ్రయం నుండి

విమానాశ్రయ డైరెక్టరు గారి వద్ద సమాచారం లేదు

ప్రారంభానికి సర్వమూ సిద్దమై చివరి నిమిషంలో ఆగిపోయిన (ప్రారంభం వాయిదా పడ్డ)  కడప విమానాశ్రయం గురించి డైరెక్టరుగారు ఇచ్చిన సమచారమిది…

ప్రశ్న: కడప విమానాశ్రయ ప్రస్తుత పరిస్తితి ఏమిటి?

సమాధానం: విమానాశ్రయానికి సంబంధించిన రన్ వే, టెర్మినల్ భవనం, ఏటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) స్తూపాల నిర్మాణం పూర్తయింది.

ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది?

సమాధానం: సమాచారం అందుబాటులో లేదు

ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?

సమాధానం: సమాచారం అందుబాటులో లేదు

ప్రశ్న: కడప విమానాశ్రయ రన్‌వేను ఉపయోగించి ఎటువంటి విమానాలు ఎగరవచ్చు?

సమాధానం: ATR72 రకం విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు అనువుగా రన్‌వేను డిజైన్ చేసి నిర్మించడం జరిగింది.

చదవండి :  కడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రం

ప్రశ్న: కడప విమానాశ్రయం యజమాని ఎవరు?

సమాధానం: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా

ప్రశ్న: విమానాశ్రయ అభివృద్ధికి లేదా నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాలు తెలపండి?

సమాధానం: ప్రహారీ గోడ, రన్‌వే సంబంధిత పనుల కోసం 25.24 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. టెర్మినల్ భవనం, ఏటిసి స్థూపం, కార్ల నిలుపుదల స్థలాల పనులకు సంబంధించి 16.55 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు 41.99 కోట్ల రూపాయలను విమానాశ్రయం కోసం ఖర్చు చేయడం జరిగింది.

ప్రశ్న: కడప విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించడానికి లేదా అందుబాటులోకి రావడానికి ఏవేని అవరోధాలు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు తెలపండి మరియు ఈ అవరోధాలను అధిగామించేదానికి AAI తీసుకున్న చర్యల వివరాలు తెలియచేయండి.

చదవండి :  అలా ఆపగలగడం సాధ్యమా?

సమాధానం: సమాచారం అందుబాటులో లేదు

ప్రశ్న: ఈ మధ్య కాలంలో కడప విమానాశ్రయ స్థాయిని మార్చాలని అం.ప్ర ప్రభుత్వం లేదా పౌర విమానయాన శాఖ నుండి ఏవేని ప్రతిపాదనలు లేదా అభ్యర్తనలు వచ్చాయా ? అటువంటివి ఏవేని ఉంటే వాటి వివరాలు తెలుపగలరు

సమాధానం: సమాచారం అందుబాటులో లేదు

ప్రశ్న: కడప విమానాశ్రయ  ప్రారంభాన్ని వాయిదా వేయాలని అం.ప్ర ప్రభుత్వం లేదా పౌర విమానయాన శాఖ లేదా కడప జిల్లా అధికారుల నుండి ఏవేని ప్రతిపాదనలు లేదా అభ్యర్తనలు వచ్చాయా ? అటువంటివి ఏవేని ఉంటే వాటి వివరాలు తెలుపగలరు?

చదవండి :  యుకె స్థానిక ఎన్నికల గోదాలో కడపాయన

సమాధానం: సమాచారం అందుబాటులో లేదు

సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నలకు విమానాశ్రయ డైరెక్టరు గారు చెప్పిన సమాధానాలివి. ఇవే కాకుండా ఇంకా అనేక ప్రశ్నలకు డైరెక్టర్ గారు చెప్పిన సమాధానం ఒకటే – అది ‘సమాచారం అందుబాటులో లేదు’ అని. బాధ్యులైన అధికారులకే విమానాశ్రయ పరిస్థితి గురించి సమాచారం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. మరి ఎవరి దగ్గర ఈ సమాచారం అందుబాటులో ఉందో?

గమనిక: విమానాశ్రయ డైరెక్టరు ఇచ్చిన సమాచారం కాపీ ఒకటి www.www.kadapa.info వద్ద అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

ఒక వ్యాఖ్య

  1. This interview has no result but NIL which does not any positive result. At last what I came to know is that KADAPA does not deserve for airport.That is why this Gov is not so serious about Kadapa people.Now this is upto Kadapa people to take action on this Gov.It’s time to wake up and should fight for our rights for the development of Kadapa.This interview show that kadap peoples have down fallen in the eyes of State Gov and as well in Delhi Gov. We have to make agitation for separate RAYALA SEEMA STATE until that time we can not acheive our development of Rayala seema.This Chandra babu is CM for only Kosta DISTRICTS, not us.If I use some harsh words in this comment, the moderator will not publish my comment to other members that is why I am using soft words.Any how thanks very much.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: