‘కడప జిల్లాను పూర్తిగా మరిచారు’

జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో

కడప : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నాడని, కడప జిల్లాను పూర్తిగా మరిచారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిపై ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కింద సుమారు రూ. 80వేల కోట్లు నిధులు మంజూరు చేస్తారని చట్టం చేసిందని అయితే వాటిని తీసుకుచ్చేందుకు సీఎం ఎందుకు ఇష్టపడటంలేదని ప్రశ్నించారు.

చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

శ్రీశైలం జలాల విషయంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే రాయలసీమ ఎడారిగామారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలన్నీ ఎండిపోవాల్సిందేనని, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి, మీరు సహృదయ వాతావరణంలో చర్చించుకుని పాలన చేయాలే కానీ ఒకరినొకరు తిట్టుకుంటూ సీమను ఎండగట్టేలా చంద్రబాబు ప్రయత్నాలున్నట్లున్నాయన్నారు.

‘ఎన్నికల ముందు సుమారు 170 హామీలిచ్చావు. 150 రోజులు దాటినా ఇంతవరకు అమలు చేయలేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెప్పించుకోలేదు. రాజధాని నిర్మాణంపై దృష్టిపెట్టలేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, నీవు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. కేసీఆర్, నీవు తిట్టుకుంటున్నారు. ఇదేనా మీ తొమ్మిదేళ్ల అనుభవం.. హామీలను అమలు పరిచే ఉద్దేశం ఉందా.. రాజధాని నిర్మాణంపై ఎందుకంత తాత్సారం. నీవు కట్టలేకపోతే చెప్పు..  ఏ మైంది నీ అనుభవం’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

చదవండి :  తెదేపా వ్యూహాలకు బ్రేకులు పడ్డట్లే!

రైతు రుణమాఫిని పట్టించుకోవట్లేదని, కోటయ్య కమిటీతో బరువు తగ్గించుకునే ప్రక్రియ చేపట్టారని, సాధికరికత పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి రైతులను మోసం చేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆ సంస్థ ఇచ్చే బాండ్లను తాము ఒప్పుకోమని బ్యాంకులు చెబుతున్నాయి. మరో వైపు సంస్థకు ఎలాంటి నిధులు కేటాయించకపోతే ఆ బాండ్లు ఎందుకని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్ఆర్జీపీ పథకం లేకపోయి ఉంటే వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారని, ప్రస్తుతం ఆ పథకాన్ని కూడా నరేంద్రమోదీ తూట్లు పొడిచేలా ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెదేపా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

చదవండి :  కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: