కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం పోలింగ్
కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాజాగా అందిన వివరాల ప్రకారం సుమారు పదిలక్షల ఓట్లు పోలయ్యాయి.అంటే మొత్తం కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం ఓట్లు పోలైనట్లు నమోదైంది. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.56 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఆ తర్వాత స్థానంలో జమ్మలమడుగు సెగ్మెంట్ ఉంది. ఇక్కడ 83.18శాతం ఓట్లు పోలైనట్లు రికార్డయింది. తదుపరి పులివెందులలో 82.64శాతం ఓట్లు, మైదుకూరులో 81.25శాతం , ప్రొద్దుటూరులో 76.4,బద్వేలులో 75.25శాతం, కడప అసెంబ్లీ సెగ్మెంటులో 61.57శాతం ఓట్లు పోలయ్యాయి.కిందటి సారి కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో డెబ్బైఆరు శాతం ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇంకా పెరగడం విశేషం.
గత రాత్రి పొద్దుపోయేవరకు కొన్ని చోట్ల పోలింగ్ జరగడం, మరికొన్ని చోట్ల ఇవిఎమ్ లకు సాంకేతిక సమస్యలు రావడం వంటి కారణాల వల్ల అన్ని లెక్కలు పూర్తి చేసుకుని సోమవారంనాడు జిల్లా కలెక్టర్ శశిభూషణ్ ఈ తాజా లెక్కలు ప్రకటించారు. కౌంటింగుకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనిఆయన చెప్పారు. కాగా రాజకీయ పార్టీలు కొన్ని తనపై చేసిన ఆరోపణలకు స్పందించడానికి కలెక్టర్ నిరాకరించారు.పోలింగ్ శాతం పెరిగే కొద్దీ తమ మెజార్టీ పెరుగుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
1 Comment
Superb Kadapa. Adurs…