కడప బెంగుళూరు విమానాలు

కడప – బెంగుళూరుల నడుమ ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు

జూన్ 7న తొలి విమాన సర్వీసు

టికెట్ ధర రూ.1234

కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సంస్థ సిద్ధమైంది.

మొదటి విమానం జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల 40 నిముషాలకు బెంగుళూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం 11 గంటల 30 నిముషాలకు కడప చేరుతుంది.

చదవండి :  మైలవరంలో 'మర్యాద రామన్న' చిత్రీకరణ

అదే విమానం 11 గంటల 50 నిముషాలకు కడప నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 35 నిముషాలకు బెంగుళూరు చేరుతుంది.

ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని ఎయిర్ పెగాసస్ ప్రారంభించింది. కడప – బెంగుళూరుల మధ్య టికెట్ ధరను రూ.1234 గా నిర్ణయించినారు.

ప్రతి ఆది, బుధ వారాలలో కడప-బెంగుళూరుల మధ్య ఈ విమాన సర్వీసు నడవనున్నట్లు ఎయిర్ పెగాసస్ సంస్థ ప్రతినిధి ఒకరు కడప.ఇన్ఫో కు తెలియచేశారు.

చదవండి :  విమానం ఎగ'రాలేదే'?

http://airpegasus.booksecure.net/criteria.aspx అనే సైట్ ద్వారా కడప – బెంగుళూరు విమాన సర్వీసుకు టికెట్లు కొనుక్కోవచ్చు.

ఇదీ చదవండి!

కడప బెంగుళూరు విమానాలు

గాలిలో చక్కర్లు కొట్టిన కడప – బెంగుళూరు విమానం

కడప: కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్నఎయిర్ పెగాసస్ విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక సుమారు అరగంటకు …

3 వ్యాఖ్యలు

  1. its good to here atleas a flght has come forward to fly,without knowing the date of inaguration of airport. but why officials are junking off…

    it would had been more better if the flight timings are during weekends like friday or satuday and then on monday again. As the software and others will b getting off on those days….

  2. http://airpagesus.booksecure.net site ye problem inka yekkadi nunchi tickets book chesukovaaali…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: