‘ఏముండయన్నా కడపలో’? : కడప పర్యటన – 1

(విజయభాస్కర్ తవ్వా )

“టీం ఔటింగ్ ఎప్పుడు?”

జట్టు సమావేశమైన ప్రతీసారి ఆనంద్ తెచ్చే ప్రస్తావన…

‘ఎన్నో రోజుల నుండి ప్రయత్నించి విఫలమైనా ఈ సారి జట్టుగా ఔటింగ్ కు వెళ్ళాలి. బాగా ప్లాన్ చెయ్యాలి.’

ఆనంద్ ఊటీ పేరు ప్రతిపాదిస్తే, శ్వేత కేరళ అంది. ప్రతీ మంగళవారం జరిగే జట్టు సమావేశంలో ఈ సారి నేనే ప్రస్తావన తెచ్చాను – ‘టీం ఔటింగ్ కి ఎక్కడి వెళ్దాం?’ అని.

“ఏదైనా సరే నేను రెడీ – బాగా ప్లాన్ చెయ్యండి. నేనూ వస్తాను.” మా మేనేజర్ ప్రతిపాదన.

చివరగా తర్జన భర్జనల అనంతరం కేరళకు ఓటేశారు మా వాళ్ళు.

ఇక బడ్జెట్ గురించి ఎస్టిమేట్ వేసే పనిని ఆనంద్ కి, రూటు మ్యాపు తయారు చేసే పనిని శ్వేతకు అప్పగించాం.

శ్వేత రూటు మ్యపుతో వచ్చేసింది. ఆనంద్ బడ్జెట్ నమూనా తయారు చేసి ఒక్కో తలకు సగటున రూ.5000 అవుతుందని లెక్క తేల్చాడు.

చదవండి :  ఊహాతీతం - ఈ ఆనందం

ఈ బడ్జెట్ సామాన్యమా? అసామాన్యమా? అన్న మీమాంస (ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ లెక్కలు చెబుతుంటే విపక్షాలకు వచ్చినట్టుగా) వచ్చింది నాకు.

‘అసలే మా వాళ్ళు నెలవారీ ఖర్చులకు తీసుకునే జీతాలకు లంకె కుదరడం లేదని (రాబడికి, వ్యయానికీ మధ్య లంకె లేదని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఆర్ధిక రంగ నిపుణులు బాధపడ్డట్లుగా) బాధపడుతుంటారు. ఐదు వేలు ఔటింగ్ కోసమంటే ఏమంటారో?’

సరిగ్గా ఇదే సందేహం సెంథిల్ కూ వచ్చింది. ‘వెంటనే జట్టు సమావేశం ఏర్పాటు చేసి చర్చల ద్వారా సందేహాన్ని నివృత్తి చేసుకందాం’ అన్నాడు.

‘గోటితో పొయ్యే దానిని గొడ్డలి వరకూ లాగడం దేనికి?’ అని మా రసూల్ సారు చెప్పిన సామెత గుర్తుకొచ్చి సమావేశామంటే చర్చ పక్క దారి పట్టి మొదటికే మోసం వస్తుందేమో అని నేనంటే ‘లేదు చర్చ జరగాలి, మనం ఒక నిర్ణయానికి రావాలి.’ అని సెంథిలూ – అదే మేలని ఆనందూ తీర్మానించేశారు.

 * * * *

ప్రెస్ నోటు చదువుతున్న రాష్ట్ర మంత్రిలా గబుక్కున విషయం చెప్పేశాను.

చదవండి :  కడప లోక్‌సభ ఏడుసార్లు వైఎస్ కుటుంబ హస్తగతం

‘ఐదు వేలా? ఎక్కువేమో…?’ అన్న చిన్న శబ్దం మెల్లగా వినబడింది. తల ఎత్తి చూస్తే … సహోద్యోగినులు గుసగుసలడుకోవడం కనిపించింది.

బెనిటా (దేశీయ వనిత, పేరు చూసి విదేశీ అనుకోవద్దు.) అంది – ‘ఐదు వేలు ఎక్కువ మేము అంత ఖర్చు చెయ్యలేము, ఔటింగ్ కోసము’ అని, సహోద్యోగినుల తరపున వకాల్తా పుచ్చుకుని (గుసగుసల అనంతరం).

వెంటనే మిగతా సహోద్యోగినులు శృతి కలిపారు. వారికి ఆనంద్ వంత పాడాడు. ఇక కేరళ ప్రయాణం అటకెక్కింది అని అర్థమైంది. ‘మరేం చేద్దాం మీరే చెప్పండి’ అనగానే ‘ఊటీకి వెళ్దాం. మూడు వేలు సరిపోతాయ్ ‘ అని బెనిటా ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చింది.

మా ఎస్టిమేట్ నిపుణుడు ‘ఆనంద్’ కలుగచేసుకుని టకటకా లెక్కలు వేసి ‘మూడు వేలతో కోయంబత్తూరు వరకు వెళ్లి రావచ్చు. ద్దగ్గరలోని ఊటీకి వెళ్ళాలంటే మరో ఐదు వందలు వేసుకోవాల్సి ఉంటుంది’ అని సూచించాడు.

చదవండి :  తెలుగుతనాన్నిఆరవోసిన 'గాథా త్రిశతి'

మళ్ళీ వాడి వేడి చర్చ జరిగింది. చివరకు ఊటీ కూడా రద్దు అయిందని నాతో ఒక ప్రకటన (డిసెంబరు ౯ నాటి చిదంబరం ప్రకటనలా) చేయించారు మా వాల్లు.

‘ఒక్కో తలకాయకు (ఆంగ్లంలో ‘పర్ హెడ్’) గరిష్టంగా ఔటింగ్ కోసం ఎంత ఖర్చు చెయ్యగలరు?’ అని ఒక ప్రశ్న వేస్తే రహస్య (గుసగుస) మంతనాల అనంతరం మా వాళ్ళు ‘రెండు వేల ఐదు వందల వరకూ (అన్నీ కలుపుకొని) మాకు సమ్మతమే’ అన్నారు.

‘సరే… మీరు రెండు వేలు ఇవ్వండి. రెండు రోజుల ట్రిప్ నేను మేనేజ్ చేస్తాను’ అని ఒక తీర్మానం చేసి ఆమోదింపజేసాను.

 * * * *

‘కాఫీ టైంలో అమర్ ని అడిగితే తిరుపతి ప్లాన్ చేయ్యగలమండీ రెండు వేలతో..’ అన్నాడు.

‘అమర్ కడప కు వెళితే ఎలా ఉంటుంది?’ అని అడిగితే… ఆనంద్ కలుగజేసుకుని ‘కడపలో ఏముందీ?’ అంటే , సుధీర్, కె.వి.ఆర్ అన్నారు ‘కడపలో ఏముండయన్నా! రాల్లూ రప్పలూ తప్ప’ అని.

(సశేషం)

ఇదీ చదవండి!

ధవళేశ్వరం బుడుగును నేను… (ముళ్లపూడి వెంకట రమణ బాల్యం)

76 సంవత్సరాల ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, …

5 వ్యాఖ్యలు

  1. కడపలో ఉన్నన్ని పర్యటనాస్థలాలు మరెక్కడా ఉండవు. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నాలుగు సంవత్సరాల పర్యంతం ప్రతీ వారాంతం ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త అనుభవం, చాలా సమాచారం. వీటన్నిటికీ మించి ఆహ్లాదం, ఆనందం.
    పులివెందుల-గండి-వేంపల్లి, కడప-దేవునికడప-పెద్దదర్గా, సంగమేశ్వరం, ముద్దనూరు వద్ద ఆర్టీపీపీ, ఒంటిమిట్ట, పుష్పగిరి, బీ మఠం, బద్వేలు, రాజంపేట, తాళ్ళపాక, వేమన సమాధి(కదిరి) కడపకు దగ్గరే!
    కొత్తగా శేషాచలం అడవుల శోభను చూపే ఇడుపులపాయ వైఎస్సార్ వ్యాలీ.
    ఏం లేవు కడపలో?

  2. కడపలో 5ఏళ్ళు పనిచేసానుకాబట్టి చెప్పగలను.ఆ జిల్లాలో చూడదగిన స్థలాలు చాలా ఉన్నాయి.ముఖ్యంగా గండికోట,దేవుని కడప, ఒంటిమిట్టరామాలయం,బ్రహ్మంగారి మఠం,తాళ్ళపాక ,పుష్పగిరి,దర్గా,మొదలైనవి.రాళ్ళూ రప్పలూ కూడా వున్నాయనుకోండి.ప్రతిజిల్లాలోను మన రాష్ట్రంలో చూడదగిన స్థలాలు,విశేషాలు ఉన్నాయి.

  3. mana ysrkadapa lo ipati varku oka tourism place kuda development cheskolekapoyam manam goppa goppa mahanubavlu puttina gadda paina amatram manam chati cheppakpovdam idi mana kadapa students ki politians ki pedda avamanam inkoti ledani na uddessam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: