
కడప నగర ఖాజీగా సయ్యద్ నజీం అలీ షామిరి
కడప: సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మే 28న విడుదల చేసిన జీవో నంబరు 65లో పేర్కొన్నారు.
1880 నాటి ఖాజీల చట్టాన్ని అనుసరించి సయ్యద్ నజీం అలీ షామిరి మూడు సంవత్సరాల పాటు కడప నగర ఖాజీగా కొనసాగుతారు.
ఖాజీలు ప్రభుత్వ చట్టాలకు లోబడి పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంటుంది. మైనర్ల పెళ్ళిళ్ళు, కాంట్రాక్టు పెళ్ళిళ్ళు జరిపే ఖాజీలు ప్రభుత్వ చట్టానికి లోబడి శిక్షార్హులవుతారు. ఒక్కో ఖాజీ ముగ్గురు నాయిబ్ ఖాజీలను నియమించుకోవచ్చు. అలా నియమించుకున్న వారి పేర్లను ప్రభుత్వానికి తెలియచేయాల్సి ఉంటుంది.