కడపలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

    కడప : అభ్యర్థులు ఎంతకాలంగానో కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష తేదీలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు బాగా సమయం ఉండడం కొంత సౌలభ్యం.

    ఇంతకుమునుపు అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాదు వంటి నగరాలకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇది తలకుమించిన భారంగా ఉండేది. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు సొంతంగానే ప్రిపేర్ అవుతుండేవారు. సరైన మార్గనిర్దేశం లేక పోటీ పరీక్షల్లో చాలామంది చతికిలపడాల్సి వస్తుండేది. ఇప్పుడు వారికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కడప ఓల్డ్ రిమ్స్‌లో ప్రభుత్వం ఏపీ బీసీ స్టడీ సర్కిల్ నెలకొల్పి, వీరికి ఉచిత శిక్షణ అందిస్తోంది. బీసీ స్టడీ సర్కిల్‌లో 60 మంది అభ్యర్థులకు 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

    చదవండి :  బొత్సతో కందుల సోదరుల చర్చ

    శిక్షణా కాలంలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.750 చొప్పున స్టయిఫండ్ కూడా అందజేస్తారు. అలాగే గ్రూప్-2కు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి జూన్ 10వ తేది ఆఖరు గడువుగా ప్రకటించారు. దరఖాస్తుల స్వీకరణ సమయం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అభ్యర్థులందరికీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన తేదీని బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు త్వరలోనే ప్రకటించనుంది. ప్రశ్నాపత్రాలు కూడా హైదరాబాదు నుంచే పంపనున్నారు. ఈ పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థుల్లో 60 మందిని ఎంపిక చేసి కడప బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తారు.

    చదవండి :  మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాలి: డా నరసింహారెడ్డి

    అర్హత ప్రమాణాలు:

    అభ్యర్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.లక్షలోపు ఉండాలి.
    ఉద్యోగం చేస్తున్న వారు శిక్షణకు అనర్హులు.

    బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇంతకు మునుపే కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు అనర్హులు.

    అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ:

    పదవ తరగతి, ఆపై విద్యార్హతలకు మెరిట్ ఆధారంగా 50 శాతం మార్కులు కేటాయిస్తారు.
    ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంపై స్టడీ సర్కిల్స్ నిర్వహించే రాత పరీక్షకు 50 శాతం మార్కులు కేటాయిస్తారు.

    చదవండి :  జవివే ఆధ్వర్యంలో 30న శ్రీశ్రీ జయంతి సభ

    బీసీలకు 65 శాతం సీట్లు (బీసీ-ఈ కింద వచ్చే ముస్లిం అభ్యర్థులతోసహా), ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 14 శాతం సీట్లు కేటాయిస్తారు.

    దరఖాస్తులు చేయడం ఇలా…..

    అభ్యర్థి పేరు, పుట్టిన తేది, తండ్రి పేరు, వృత్తి, కులం, కుటుంబ వార్షికాదాయం, మార్కులు-శాతాలు, చిరునామా, మొబైల్ నెంబరు వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
    సంబంధిత తహశీల్దార్‌చే జారీ చేయబడిన కులం, ఆదాయ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

    అలాగే విద్యార్హతలకు సంబంధించిన నకలు కాపీలు, ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేసినట్లు తెలిపే అక్నాలెడ్జ్‌మెంట్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోగ్రాఫ్‌లు, ఐదు రూపాయల స్టాంపు అతికించిన ఒక సొంత చిరునామాగల కవరును జతచేసి దరఖాస్తును సమర్పించాలి.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *