కడపజిల్లాపై చెరగని వైఎస్ ముద్ర.!

కడప జిల్లా నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. జిల్లా వాసి వైఎస్ 2004లో సీఎం అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గాను, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోరూ.130 కోట్లతో రిమ్స్ వైద్య కళాశాలA, 750 పడకల రిమ్స్ అసుపత్రి, రూ.22 కోట్లతో దంత వైద్యశాల, 21వ శతాబ్ధం గురుకులం నెలకొల్పారు.

అలాగే ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్ పశు పరిశోధన కేంద్రం, దాల్మీయా సిమెంటు కర్మాగారం, బ్రహ్మణీ స్టీల్స్, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల పాలిమర్స్ వంటి పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు డాక్టర్ వైఎస్ హయాంలో ప్రాణం పోసుకున్నాయి. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లను ఖర్చు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగు గంగ ప్రాజెక్టు పనులకు పరుగులు పెట్టించారు.

చదవండి :  కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితి ఏర్పాటు

లోపించిన చిత్తశుద్ధి….
వైఎస్ జీవించి ఉండగా ఆయన వెన్నంటే నడిచిన కాంగ్రెస్ శ్రేణులు ఆ తర్వాత అవకాశవాద రాజకీయాల వైపు మొగ్గు చూపాయి. మహానేత వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వైఎస్ అకాల మరణం తర్వాత 61వ జయంతి సందర్భంగా కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు.

ఆగిన అభివృద్ధి…
వైఎస్ హయాంలో శరవేగంగా సాగిన జిల్లా అభివృద్ధి తుది దశకు చేరే సమయంలో ఆయన అకాలమృతితో ప్రశ్నార్థకంగా మారింది. సోమశిల వెనుక జలాలను వైవీయూ, ఏపీఐఐసీ పార్కుకు ఇప్పించే యత్నాన్ని వైఎస్ చేపట్టారు. రూ.430 కోట్లతో చేపట్టిన ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రూ.11వేల కోట్లతో చేపట్టిన జలయజ్ఞం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వైఎస్ హయాంలో జీఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-1 పనులు 85 శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు పూర్తికావడం లేదు. బుగ్గవంక సుందరీకరణ, కడప నగర అభివృద్ధి, ప్రొద్దుటూరు-కదిరి హైవే పనుల ఊసే లేదు. కడప- బెంగుళూరు రైల్వేలైను పనులు సర్వేకు మాత్రమే పరిమితమయ్యాయి. ట్రిపుల్ ఐటీ విద్య ప్రశ్నార్థకంగా మారింది. ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ నేతృత్వంలో స్వాధీనం చేసుకున్న 5వేల ఎకరాలు నిరుపయోగంగా మారాయి. 2009లోనే విమానశ్రయం పనులు తుది దశకు చేరుకున్నా నేటికీ అలాగే ఉండిపోయాయి. గండికోట ఎకో ప్రాజెక్టు, పవన విద్యుత్ పథకాలు మరుగున పడ్డాయి. రూ.25 కోట్లతో వైఎస్‌ఆర్ సృ్మతి వనం కోసం ఇడుపులపాయలో ఏడాది కిందట శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.

చదవండి :  వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: