ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు
వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు
కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు
ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల//

సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు
వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు
రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు
పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల//

నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు
కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు
కుర్చీలు ఎక్కగానె–కొండచిలువలైపోయి
దిగమింగే కార్యాన్ని– దీక్ష తోన చేస్తారు //చింతల//

వానలుకురిసే చోటుకు–వరదలు పొంగేనేలకు
ప్రాజక్టుల నీళ్లన్నీ–సంతర్పణ చేస్తారు
ఎడారి బీడు సీమకేమొ–
కన్నీటితుడుపు –ప్రణాళికా కాగితాలు //చింతల//

చదవండి :  రాయలసీమ సమస్యలపై ఉద్యమం

ఒకకంటికిసున్నము– మరోకంటికేమొ వెన్న
కార్పొరేటు కౌగిళ్లు–కలకాలం రక్షించవు
కడుపు కాలు బతుకులన్ని– గళమెత్తీ ఘర్జిస్తే
ఢిల్లీ నవాబుకూడ– గల్లికొచ్చి పడాల్సిందె //చింతల//

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం ..గద్దించే

గట్టి గింజలు (కవిత)

పిడికెడంత సీమ గుప్పెడంత ప్రేమ వేటకుక్కల్నే యంటబడి తరిమిన కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర! రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ! …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: