ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

హైదరాబాద్ : ఉపఎన్నికలు జరగనున్న కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడప నుంచి రాజ్యసభసభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి మర్రెడ్డి రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బాబు అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి.

వైఎస్సార్ కడప జిల్లా నేతలు, టీడీపీ సీనియర్లు దేవేందర్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్, ఎం.లింగారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, ఎస్వీ సతీశ్‌రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, అమీర్‌బాబు తదితరులతో బాబు బుధవారం ముందు విడివిడిగా, తర్వాత ఉమ్మడిగా మాట్లాడారు. అనంతరం వారితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

కడప, పులివెందుల ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వ స్తాయని, గెలుపు తమదేనని అన్నారు. ‘‘అందరితో మాట్లాడాం. జిల్లా నేతలందరూ పోటీకి సిద్ధంగా ఉన్నా, సమర్థులని భావించి మైసూరా, రవిలను ఏకాభిప్రాయంతో ఎంపిక చేశాం. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలపై బలమైన మా జిల్లా నేతలతోపాటు రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది’’ అన్నారు. కందుల కుటుంబం పార్టీ నుంచి వెళ్లిపోవటంవల్ల ఓట్లేమీ చీలవని, తమకు ఇబ్బందేమీ ఉండదని బాబు అన్నారు. ఓటింగ్‌పైనా వారి ప్రభావం ఉండదన్నారు.

చదవండి :  యోవేవి ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను తిట్టిన తెదేపా నేత?

కాంగ్రెస్‌కు అభ్యర్థుల్లేక ఇతర పార్టీల వారిని చేర్చుకుని బరిలో దించే స్థితికి దిగజారిందని విమర్శించారు. ‘‘కందుల కుటుంబానికి ప్రతిసారి సీటిచ్చాం. ఆయన్ను కొద్ది రోజుల క్రితం ఇన్‌చార్జిగా తొలగించాలన్నా నేనంగీకరించలేదు. ఎవరైనా పార్టీ కోసం పని చేస్తే గౌరవిస్తాం. సీటడగటం, ఒత్తిడి చేయటం, ఇవ్వలేదని బైటకెళ్లడం సరికాదు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పని చేసినవారు ఏవో కారణాలతో పార్టీకి అన్యాయం చేయడం సబబు కాదు. వారి వెంట నడిచే వారెవరూ లేరు.కొందరిని ప్రలోభపెట్టాలని చూస్తున్నా అది జరిగేది కాదు’’ అన్నారు. అంతలోకే, ఒకరిద్దరు నేతలు దేనికైనా లొంగినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉంటారని చెప్పుకొచ్చారు.

చదవండి :  రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఇద్దరూ మా ప్రత్యర్థులే: మైసూరా

‘‘కడప ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెండూ మాకు సమాన ప్రత్యర్థులే. అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా పార్టీ నాపై గురుతర బాధ్యత ఉంచింది. పార్టీకున్న అన్ని రకాల శక్తులు, వనరులను ఎన్నికల్లో ఉపయోగించుకుని గెలుస్తాం. నన్ను గెలిపించేందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపిందన్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశపూరితమే.’’

విజయమ్మే మా ప్రత్యర్థి: బీటెక్ రవి

‘‘పులివెందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మే మా ప్రధాన పోటీదారు. అక్కడ గెలుపు టీడీపీదే. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి దక్కేది మూడో స్థానమే. ఎవరో చెప్పినంత మాత్రాన డమ్మీ అభ్యర్థిగా దిగి భవిష్యత్తు నాశనం చేసుకోవాలని ఎవరూ ఆలోచించరు. నాకెంతో రాజకీయ జీవితముండగా అందుకెలా అంగీకరిస్తాను? నేను డమ్మీనో, సమర్థుడినో మే 13న ఫలితాలతో తేలుతుంది. కందుల శివానందరెడ్డి సత్తా కడప అసెంబ్లీకే పరిమితం తప్ప పులివెందులలో లేదు.’’

చదవండి :  సీమ విషయంలో ప్రభుత్వ దాష్టీకాలపై గొంతెత్తిన జగన్

మైసూరారెడ్డి జీవిత విశేషాలు…

 

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: