రాయచోటి: సుండుపల్లి- సానిపాయ మార్గంలో బుర్రలదిన్నెపల్లె దగ్గర ఈ గురు, శుక్ర వారాలలో ఇస్తిమా (ఆధ్యాత్మిక సమ్మేళనం) జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు.
భారీ స్థాయిలో తాగునీటి వసతి, షామియానాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఆయా మార్గాల్లో నిలిపేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో ప్రవక్త బోధనలు, సామూహిక ప్రార్థనలు, మంచి సందేశాలు ఉంటాయని సమాచారం.