ఇలా చేస్తుందనుకోలేదు…

ఇలా చేస్తుందనుకోలేదు…

బర్తరఫ్‌పై డిఎల్‌ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధిష్ఠానం ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని డిఎల్‌.రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న డిఎల్‌ టీవీ ఛానళ్లతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తనకు విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విభేదాలుం డడటం సహజమన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఆరాటపడ్డానని వ్యాఖ్యానించారు. గతంలో తాను రాజీనామా చేశానని తన రాజీనామాను ఇంకా ఆమోదించాల్సి ఉందని డిఎల్‌ అన్నారు.

అచ్చిరాని వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అచ్చిరావడం లేదు. తొలి విడతలో మైదుకూరు కల్తీరాసా దుర్ఘటనలో 90వ దశకంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తూ మంత్రి పదవిని కోల్పోయారు. తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్న ఆయన మరో మారు బర్త్ఫ్ ్రకావాల్సి వచ్చింది. డీఎల్ రవీంద్రారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అచ్చిరావడం లేదని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
చదవండి :  విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *