ఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన

composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam

ఇటు గరుడని నీ వెక్కినను

పటపట దిక్కులు బగ్గన బగిలె

 ఎగసినగరుడని యేపున’ధా’యని

జిగిదొలకచబుకు చేసినను

నిగమాంతంబులు నిగమసంఘములు

బిరుసుగ గరుడని పేరెము దోలుచు

బెరసి నీవు గోపించినను

సరుస నిఖిలములు జర్జరితములై

తిరువున నలుగడ దిరదిర దిరిగె

పల్లించిననీపసిడిగరుడనిని

కెల్లున నీవెక్కినయపుడు

ఝల్లనె రాక్షససమితి నీ మహిమ

వెల్లి మునుగుదురు వేంకటరమణ

చదవండి :  నవ వసంతం (కథ) - తవ్వా ఓబుల్ రెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: