ఆశలన్నీ ఆవిరి

కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి

కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి:

డీఆర్డీవో ప్రతిపాదించిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టును కొప్పర్తిలోనే నెలకొల్పుతామని డీఆర్డీవో వాళ్ళే వచ్చి అడిగారు (http://www.thehindu.com/news/cities/Vijayawada/electronic-warfare-lab-in-kadapa-district/article6398329.ece). ఇప్పుడేమో వెంకయ్యనాయుడు గారు అక్కడున్న విమానాశ్రయం దానికి అడ్డొస్తుంది కాబట్టి కుదరదని తేల్చేశారు. ఆ ప్రాజెక్టు ప్రతిపాదించేనాటికే నిర్మాణం పూర్తై, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విమానాశ్రయం కనబడనంతగా వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయనుకోవాలా? అలాగే అనుకుందాం.

ఇప్పుడు దాన్ని తీసుకుపోయి రాయలసీమలోనే ఇంకెక్కడో నెలకొల్పుతామంటున్నారు. ఏం, కడప జిల్లాలోనే వేరొకచోట ఎందుకు నెలకొల్పకూడదు? ఈ జిల్లాలో కొప్పర్తిలో తప్ప ఇంకెక్కడా భూములు లేవా? మూడున్నరవేల ఎకరాలు అవసరమయ్యే ఈ ప్రాజెక్టు కోసం జమ్మలమడుగులో 13 వేల ఎకరాలు ఉండగా “కడప జిల్లాలోనే” అనకుండా “రాయలసీమలో ఇంకెక్కడైనా” అంటున్న వెంకయ్య గారూ, ఒక్కటడుగుతాను, ఏమనుకోకండి: మీ పక్కింటివాళ్ళు మీ విస్తట్లోని ఆహారం లాక్కుని విందుచేసుకుంటే మీకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.

చదవండి :  కడప పార్లమెంటులో ఎవరికెన్ని ఓట్లు

ఉక్కు పరిశ్రమ: ఈ పరిశ్రమ నిర్మాణం గురించి నవంబరు నెలాఖర్లోగా నివేదిక సమర్పిస్తామని గతంలో సెయిల్ చెబితే ఇప్పుడేమో తీరిగ్గా గడువు ముగిశాక డిసెంబరులో కమిటీ వేశారని వెంకయ్యనాయుడు చల్లగా చెప్తున్నారు. మరి నవంబరు నెలాఖరు వరకు ఏం చేసినట్లు? అసలు అపాయింటెడ్ డే (2 జూన్, 2014) నుంచి ఆర్నెల్లలోగా అంటే డిసెంబరు 1 లోపల నివేదిక సిద్ధంచెయ్యమని కదా రాష్ట్రవిభజన బిల్లులో పేర్కొన్నది? గడువులోపల పూర్తిచెయ్యవలసిన పని “గడువు ముగిశాక” మొదలుపెట్టడమేమిటి? ఇప్పుడు మొదలుపెడితే నివేదిక ఎప్పటికి సిద్ధమయేను? నివేదిక(Project Plan)కే ఏళ్ళూ పూళ్ళూ పడితే (నిర్దిష్టమైన కాలపరిమితి లేకపోవడం వల్ల) పని ఎప్పటికి మొదలయ్యేను?

చదవండి :  కవయిత్రి మొల్ల - మా ఊరు

విభజన బిల్లులో పేర్కొన్న విద్యాసంస్థల విషయంలో మాత్రం అవిశ్రాంతంగా కేంద్రప్రభుత్వం మీద వీలైన అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకొచ్చి పనులు ప్రారంభింపజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి నలభై వేల మందికి ఉపాధి కల్పించే ఇంతటి బృహత్తర ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వసంస్థ ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నా నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటి? ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధాన మంత్రితో సహా అనేక కేంద్రమంత్రులతో సమావేశమయ్యే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్కు శాఖామంత్రిని గానీ, సెయిల్ అధికారులను గానీ ఒక్కసారైనా కనీసం మర్యాదపూర్వకంగా కలవకపోవడానికి కారణమేమిటి?

నందలూరులో మూసివేసిన లోకోషెడ్డుకు ప్రత్యామ్నాయంగా రైల్వే పరిశ్రమ ఏర్పాటు: గత ఇరవయ్యేళ్ళుగా నలుగుతున్న అంశమిది. బీజేపీ స్థానిక నాయకులు మొదలుకొని గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసిన “చిన్నమ్మ” పురందేశ్వరి దాకా చిన్నా పెద్దా నాయకులందరూ ఎడాపెడా హామీలు గుప్పిస్తూనే ఉన్నా ఇప్పటికీ ఏం చెయ్యాలో వాళ్ళకే స్పష్టత లేకపోతే ఉక్కు కర్మాగారం విషయంలో జరుగుతున్న నిర్వాకం చూస్తూ కూడా ఈ విషయంలో ఏం చెయ్యగలరని ఆశించగలం చెప్పండి? ఏ పనికైనా చెయ్యాలనే “మనసుంటేనే” మార్గముంటుంది. ఇక్కడ లేనిదల్లా అదే.

చదవండి :  కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ - 2

విమానాశ్రయం: పని పూర్తయ్యీ రాష్ట్ర ప్రభుత్వ అధినేతల కక్షసాధింపు వల్ల ప్రారంభానికి నోచుకోవడం లేదనే నిజాన్ని వెల్లడించలేక కాబోలు దీని ఊసే ఎత్తలేదు.

వెంకయ్యనాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో అప్పటివరకు ఎవరికైనా ఆశలు మిగిలి ఉంటే వాటిని కూడా చిదిమేసి వెళ్ళగా జిల్లా అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామంటున్న కందుల సోదరులు పై నాలుగు అంశాల విషయంలో ఏం ప్రయత్నాలు చేస్తారో, ఎంతవరకు సాధించగలరో చూడాల్సిందే

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

ఒక వ్యాఖ్య

  1. My dear friends, I want to remind again the peoples of KADAPA, even minister Mr.Venkah naidu visit for KADAPA nothing will get improve, or nothing will be in progress to Kadapa, because every party want to neglect Kadapa development,because this is belong to ysr and second the peoples are lazy and mostly uneducated,as well it is very back ward area. third now election are over now political parties do not have need with people.All political parites need the poeple when there will be election. So I want warn to peoples of KADAPA, wake up from sleep strat agitation for our development.Do not wait for political party leaders to get help in development of Kadapa. Every leader is very busy in his own development or his chair or how to get lot of money from ruling party.Please do not expect any thing any positive things from these politicians,that is why my strong advise is we as are Kadapa people have to start fight for our developments.Please start fighting for our developments.JAI HIND.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: