అప్పులవారే అందరును – అన్నమయ్య సంకీర్తన

అప్పులవారే అందరును – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ
॥చ1॥
ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక
॥చ2॥
యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే
॥చ3॥
యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు
రాగము: దేసాళం
రేకు: 0013-05
సంపుటము: 1-81

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళం

చదవండి :  అన్నియును నతని కృత్యములే - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: