అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు

    గోడపత్రం విడుదల చేస్తున్న తితిదే అధికారులు

    అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు

    పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511వ వర్థంతి ఉత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకూ అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద, తిరుమల, తిరుపతిలలో దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తి.తి.దే డిప్యూటీ ఈవోలు శారద, బాలాజీ, ఏఈవో పద్మావతి తెలిపారు. ఇటీవల తాళ్లపాక అన్నమాచార్య ధ్యానమందిరంలో వర్థంతి ఉత్సవాల గోడపత్రాన్ని విడుదల చేశారు.

    తాళ్ళపాక, 108 అడుగుల విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలు:

    27న బహుళద్వాదశి పూజలు, గోష్ఠిగానం, అన్నమయ్య చిత్రపటం వూరేగింపు

    చదవండి :  కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

    మార్చి 27 నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజూ …

    – సాయంత్రం 5.30గంటలకు సంగీత సభలు (తాళ్లపాకలో)

    – రాత్రి 7 గంటల నుంచి  9గంటల వరకు హరికథ కాలక్షేపం రెండు చోట్లా (తాళ్ళపాక గ్రామం, అన్నమయ్య విగ్రహం దగ్గర)

    తిరుపతి – తిరుమలలో కార్యక్రమాలు:

    మార్చి 27న తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 1000మంది కళాకారులచే గోష్టిగానం. అదే రోజు సాయంత్రం ఆస్థాన మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    మార్చి 27 నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజూ తిరుపతి నగరంలోని మహతి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    చదవండి :  తితిదే నుండి దేవాదాయశాఖకు 'గండి' ఆలయం

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *