
93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం
కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు.
స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు అన్ని విభాగాల పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో బలోపేతానికి విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు అందరూ బాగా పనిచేస్తున్నారన్నారు. మరింత బాగా పని చేసి క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేస్తారని, పార్టీ శ్రేణులతోపాటు పార్టీ అనుబంధ సంఘాలు పనిచేయాలని వివరించారు. పార్టీ అధ్యక్షుని ఆదేశానుసారం జిల్లాలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు