
పొడవైన శేషగిరి బోయనాయఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పొడవైన శేషగిరి బోయనాయఁడు విడువ కిందరిఁ గాచు వెడబోయ నాయఁడు ॥చ1॥ పొలసి మీసాల పెద్దబోయ నాయఁడు మలిగి వీఁపునఁ గట్టేమంకుబోయ నాయఁడు పొలమురాజై తిరిగేబోయ నాయఁడు వెలయ మోటుననుండేవేఁటబోయ నాయఁడు ॥చ2॥ పొట్టిపొట్టియడుగులబోయ నాయఁడు యెందు బుట్టుపగసాధించేబోయ నాయఁడు బొట్టులమెకమునేసేబోయ నాయఁడు పట్టపునెమలిచుంగబలుబోయ నాయఁడు ॥చ3॥ పొంచి శిగ్గెగ్గెఱగనిబోయ నాయఁడు మించి రాలమీఁదదాఁటేమెండుబోయ నాయఁడు అంచెల శ్రీవేంకటేశుడనేబోయ నాయఁడు పంచఁ గాలవేలములబలుబోయ నాయఁడు |
రాగము: బౌళి రేకు: 0093-02 సంపుటము: 1-460 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి