పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?) – అన్నమయ్య సంకీర్తన

పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?) – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?)
నీరసపుటెద్దవైననీకు నే ముద్దా
॥చ1॥
ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివి
వొద్దనైన వచ్చి వూరకుండవైతివి
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక
నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా
॥చ2॥
కాఁపురపుఁ బాపపునాకర్మమును ధరించి
వీఁపువగులఁగ దాకి విఱ్ఱవీఁగితి
ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకులచవి మూట-
మోపరివి నీకు నాముదము ముద్దా
॥చ3॥
మచ్చిరించి అల్లనాఁడు మాలవాఁడు కాలందన్ని
తెచ్చినయప్పటిధర్మ దేవతవు
యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను
మెచ్చి తాఁకితివి నామేను నీకు ముద్దా
రాగము: భూపాళం
రేకు: 0014-05
సంపుటము: 1-87

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం

చదవండి :  తహతహ లిన్నిటికి తానే మూలము గాన - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: