కడప జిల్లాలో వాడుకలో ఉన్న పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పారకాల’ Telugu Language.
పారకోల లేదా పారకాల :
నామవాచకం (noun), ఏకవచనం (Singular)
- ఒక వ్యవసాయ పనిముట్టు
- కురిపె
- బొరిగె
- తవ్వుగోలు
- దోకుడు బార (కోస్తా)
- చెక్కుడు పార (తెలంగాణా)
- కలుపు కత్తి (భద్రాచలం)
- గొబ్బం
పారకోలలు లేదా పారకాలలు (Plural)
వివరణ :
కడప జిల్లాలో పారకోల అనేది ఒక వ్యవసాయ పనిముట్టు (ఫోటో చూడండి) . దాదాపు అడుగున్నర పొడుగు కొయ్యకు చివర ఱేకు అమర్చిన త్రవ్వు పనిముట్టు ఈ పారకాల. దీనిని కలుపు తీసేదానికి వాడతారు. మిరప, బెండ, టమోటా, పత్తి, చెరుకు మొదలగు ఆరుతడి పంటలలో కలుపు తీయటానికి కొడవళ్ళు, తొలికెలతో పాటుగా ఈ పారకోల్లను వాడతారు.
వాడుక:
- ఓక్కా! కూలోల్లు వచ్చానారు. మీ పారకోల్లు ఇచ్చారా? మాయిటాల తెచ్చిచ్చం.
- పారకోల్లు మొద్దుబోయినాయి.