వైఎస్సార్ క్రీడాపాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు

క్రీడా పాఠశాలలోని ఈతకొలనులో అభ్యాసం చేస్తున్న విద్యార్థులు (పాత చిత్రం)

వైఎస్సార్ క్రీడాపాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు

40 మంది విద్యార్థులకు ప్రవేశం

కడప: జిల్లాలోని వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి మంగళవారం వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ తరగతి ప్రవేశానికి 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు.

ఎంపికల ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, జిల్లాస్థాయిలో డీఎస్‌డీవోలు ఎంపికలు నిర్వహిస్తారన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రస్థాయి ఎంపికల్లో సత్తాచాటినవారికి కడపలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: