‘వారిని కోటీశ్వరులను చేసేందుకే’ – కర్నూలు ఎమ్మెల్యేలు

‘వారిని కోటీశ్వరులను చేసేందుకే’ – కర్నూలు ఎమ్మెల్యేలు

ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు.

నలభై ఐదు అంతస్థుల భవనాలు నిర్మించడం ప్రమాదం కావచ్చని వారు హెచ్చరించారు.కర్నూలుకు అన్ని అర్హతలు ఉన్నా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మోహన్ రెడ్డి విమర్శించారు.

విజయవాడ రాజధానిని చేస్తే సీమకు చెందిన మంత్రులు కూడా హర్షం ప్రకటించడం సిగ్గు చేటని వారు ధ్వజమెత్తారు. వైకాపా అధినేత విజయవాడకు అనుకూలమని ప్రకటించినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని విషయంలో భిన్నమైన వైఖరి తీసుకోవడం హర్షణీయం. మిగతా రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపై వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తారా?

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: