కడపలో ఓటుకు ఎంత పంచారు?

ఉప ఎన్నికల ఫలితాలపై ‘ఆ ముగ్గురికే పట్టం’ పేరుతొ కడప జిల్లా టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక అందులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈనాడు కధనం ప్రకారం రాయచోటి, రాజంపేట, రైల్వేకొడూరులలో తెదేపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు ఓటుకు ఐదు వందలనుంది వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్తులు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కాంగ్రెస్, తెదేపా అభ్యర్తులు బాగా నగదు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు గంప గుత్తగా వైకాపాకు ఓటేశారని కూడా పేర్కొంది. ఈనాడు కధనం నిజమైతే కడప జిల్లా ఓటర్లు డబ్బు తీసుకుని మరీ కాంగ్రెస్, తెదేపాలకు షాకిచ్చారన్న్నమాట!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: