ఆదివారం , 22 డిసెంబర్ 2024

కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.

చదవండి :  ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

ఈ-సేవ కౌంటర్ వేళలు:

శని, ఆది వారాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు, మిగతా రోజుల్లో (సోమ, బుధ, గురు, శుక్ర వారాలలో) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ‘ఈ’ కౌంటర్ పని చేస్తుంది.

మంగళవారం సెలవు.

ముందస్తు బుకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు:

ఈ కౌంటర్ ద్వారా స్వామి దర్శనం, వసతి కోసం గదులు, ఆర్జిత సేవలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఆర్జిత సేవల రుసుము వివరాలు :

కల్యాణోత్సవం….రూ. 10,000 (ఇద్దరికి ప్రవేశం)

చదవండి :  తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

సుప్రభాతం….రూ. 120 ఒక్క టికెట్ (ఒక్కరికి) మాత్రమే ఇస్తారు

ఊంజల్ సేవ….రూ. 200

ఆర్జిత బ్రహ్మోత్సవం….రూ. 200

వసంతోత్సవం……రూ. 300

సమస్ర దీపాలంకార సేవ…రూ. 200

విశేష పూజ….రూ. 600

అష్టాదళ పద్మారాధన….రూ. 1250 (శుక్రవారం మాత్రమే)

వసతి కోసం గదులు రూ. 100, రూ. 200 (24 గంటలు మాత్రమే)

శ్రీ పద్మావతి దేవి(తిరుచానూరు) అమ్మవారి ఆర్జిత సేవలు:

అభిషేకం…రూ.400

అష్టాదళ పద్మారాధన…రూ.1500 (ఐదుగురికి)

అష్టోత్తర శత కలశాభిషేకం…రూ.2000 (ఇద్దరికి)

చదవండి :  జాతీయ ఈత పోటీలకు మనోళ్ళు 11మంది

కల్యాణోత్సవం…రూ. 500 (ఐదుగురికి)

లక్ష్మిపూజ….రూ. 116 (ఒక్కొక్కరికి)

పుష్పాంజలి సేవ…..రూ.1500 (ఐదుగురికి)

తిరుప్పావడ…..రూ. 3000 (ఐదుగురికి)

వస్త్రాలంకార సేవ….రూ. 10,000 (ఇద్దరికి)

ఎన్ని రోజుల ముందు ?

మూడు రోజుల తర్వాత నుంచి మూడు నెలల లోపుగా దర్శనాలు, ఆర్జిత సేవలకు ఈ-సేవ కేంద్రం నుంచి బుక్ చేసుకోవచ్చు.

కౌంటర్ వద్దకు రావాలి…

సేవలలో పాల్గొనదలిచిన కుటుంబ సభ్యులందరూ వచ్చి కౌంటర్ వద్ద ఫొటో తీయించుకుని, వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆర్జిత సేవల్లో 12 ఏళ్లలోపు బాలలకు ప్రవేశం ఉచితం.

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: