శుక్రవారం , 27 డిసెంబర్ 2024

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 రాసేవి, చూపేవే వార్తలా? – జగన్

అనంతపురం: ఏదో ఒక రోజు సిబిఐ ఇలా చేస్తుందని ముందే ఊహించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడుతూ సాక్షికి సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో సాక్షి మీడియాను నిరోధించలేరన్నారు. జనం మీడియాగా సాక్షి ఏనాడో ప్రజాదరణ పొందిందన్నారు.

పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పేర్కొన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 రాసేవి, చూపేవే వార్తలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, చంద్రబాబు తప్ప మూడో వారు ఉండకూడదన్నది వారి ఉద్దేశం అన్నారు. తనని ఎదుర్కోలేక ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం తనని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

ఇదీ చదవండి!

ఈనాడు పైత్యం

పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు చదివే పత్రికగా చెలామణి అవుతున్న ఈనాడు ఒక వార్తకు పెట్టిన హెడింగ్ ద్వారా మళ్ళా తన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: