నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు… పోలీసు బలగాల పహారా

కడప: నగరంలో నేడు వైకాపా ధర్నా కార్యక్రమానికి వచ్చే నేతలు, రైతులు, పార్టీ కార్యకర్తల వాహనాల రాకపోకలకు సంబంధించి కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ ఆంక్షలు విధించారు. మైదుకూరు, కమలాపురం, పులివెందుల రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలను మోచంపేట వద్ద ఉన్న మరాఠీ మఠం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గం నుంచి వచ్చే వాహనాలకు రాజారెడ్డివీధిలోని సీఎస్‌ఐ చర్చి వెనుక ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం బస్సులు ఆర్టీసీ బస్టాండ్‌ కు మాత్రమే వెళతాయని, పాత బస్టాండ్‌కు బస్సులు రావని డీఎస్పీ తెలిపారు. పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.

చదవండి :  రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు

కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, పోలీసులకు జిల్లా ఎస్పీ డాక్టర్‌ నవీన్‌గులాఠీ గురువారం పెరేడ్‌గ్రౌండ్‌లో ఆయన పలు సూచనలు ఇచ్చారు. ధర్నా శాంతియుతంగా జరుగుతుం ది కాబట్టి సిబ్బంది కూడా సమన్వయంతో ఉండాలన్నారు. అలాగే ధర్నాలో అల్లరిమూకలు ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి అప్ర మత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ధర్నాకు వచ్చే వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా ఉండాలన్నారు.

చదవండి :  పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: