ఆదివారం , 22 డిసెంబర్ 2024

‘సీమ కోసం సభలో నోరెత్తండి’

కడప:  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పోరాడాలన్నారు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

చదవండి :  నేడు ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ ద్వితీయ వర్ధంతి

ఈ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్దన్, ఉపాధ్యక్షుడు జకరయ్య, నాయకులు మల్లికార్జున, సుబ్బరాజు, నాగరాజు, నాయక్, ప్రసన్న తదితరులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: