Tags :తెలుగు కథ

కథలు

ఊరి పిల్లోడు (కథ) – పి రామకృష్ణారెడ్డి

ఊరి పిల్లోడు పెన్నేటి కతలు ఆ పిల్లోని అస్సలు పేరు వాళ్లమ్మా, నాయినకూ తప్ప మల్లెవరికీ తెల్దు గానీ ఊళ్లో అందరికీ టంగుటూరోళ్ల పిల్లోడంటే తెల్సు. ఏడుస్తా వుండేవాళ్లకైనా ఆ పిల్లోని పడవ* సెప్తే, ఏడుపు ఇచ్చిపోయి మొకాన నగుపొద్దు పొడవాల్సిందే. అట్టాటోడు ఆ పిల్లోడు! పిల్లోడంటే పిల్లోడే. పదీ పదకొండేండ్లుంటాయేమో, బక్కగా నల్లగా వుండి మినమిన మెర్సే సూపుల్తో దేనిమీదా సిటికేసినంత సేపు సూపు నిలపకుండా బూలోకమంతా ఒక్కసారే సూస్తా వున్నెట్టు వుంటాడు. ఇంట్లో యెప్పుడుంటాడో […]పూర్తి వివరాలు ...

కథలు

అలసిన గుండెలు (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి

అలసిన గుండెలు ఆరో కాన్పుకు అమ్మగారింటికి పోవడానికి సిగ్గయింది శేషమ్మకు. పోయిన సారి పుట్టింటికి పోయినప్పుడు తమ్ముని భార్య ములికివంటి మాట అన్నది: “కనడానికేం – నేనూ కంటాను. సంవత్సరానికి ఒక పిల్లను. చాకిరీ చేసేవాళ్లు ఉండొద్దూ.” ఆ మాట విన్నప్పుడు ముసలి తల్లిని పట్టుకొని మూడు రోజులు ఏడ్చింది శేషమ్మ. “గొడ్డుమోతుది దాని మాటలకేం లేమ్మా” అని తల్లి ఎంత ఓదార్చినా, ఆనాడే తీర్మానం చేసుకున్నది — ఇక పుట్టింటికి పోకూడదని. ఇప్పుడు మళ్లీ అమ్మగారింటికి […]పూర్తి వివరాలు ...

కథలు

ఊరూ వాడా (కథ) – సొదుం జయరాం

ఊరూ వాడా సొదుం జయరాం కథ మా ఆవిడకు బ్రెయిన్ వాష్ చెయ్యడమన్నది నా వల్ల అయ్యే పనికాదు. ఆవిడ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందంటే దాన్నుంచి ఒక్క ఇంచ్ కదలించడం కూడా కష్టమే. కానీ ఓటమిని అంగీకరించడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో మా ఇద్దరి మధ్యా పేచీ ప్రారంభమైంది. “మీరు నూరు చెప్పండి, పల్లెటూరికి అమ్మాయిని ఇవ్వడానికి ససేమిరా నేనొప్పుకోను” అంది ఖచ్చితంగా అరుణ. “పల్లెలంటే పూర్వంలాగానే వున్నాయనుకుంటున్నావేమో. అదేం కాదు. పల్లెలు […]పూర్తి వివరాలు ...

కథలు

పాడె (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ పాడె చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు. చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, […]పూర్తి వివరాలు ...

కథలు

తాకట్టు (కథ) – సొదుం జయరాం

తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...

కథలు

రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి […]పూర్తి వివరాలు ...

కథలు

చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితుల‌ను పోల్చి చేసుకునేందుకు ఒక కొల‌మానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్‌ రాసిన కథలు)  […]పూర్తి వివరాలు ...

కథలు

అడవి (కథ) – సొదుం జయరాం

‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ పూర్తి వివరాలు ...

error: