సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. …
పూర్తి వివరాలుమనువు (కథ) – సొదుం జయరాం
సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ. దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు …
పూర్తి వివరాలుఅడవి (కథ) – సొదుం జయరాం
‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’
పూర్తి వివరాలురచయితకు “స్పిరిచ్యువల్ శాటిస్పాక్షన్’ అవసరం
పరుగులపోటీలాగ కథల పోటీ ఏంటి? సృజనాత్మకతకు పోటీ ఉంటుందా? అసలు సృజన అనేదే పోటీ లేనిది. కాకపోతే ఎవరి సృజన వాళ్లది. ఒకటి తక్కువ కాదు. మరొకటి ఎక్కువా కాదు. కథల పోటీల గురించి తలచినప్పుడల్లా నాకు సొదుం జయరాం (చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఊరిపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా కలవలేకపోయాను) గుర్తుకొస్తాడు. …
పూర్తి వివరాలుమన జయరాం, మన సొదుం
మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల …
పూర్తి వివరాలు‘నాది పనికిమాలిన ఆలోచన’
కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి …
పూర్తి వివరాలుజయరాం కథలు..వాడని మల్లెలు!
‘థాకరే బతకడం కోసం రాశాడు, డికెన్స్ రాయాలి కాబట్టి రాశాడు’ అన్నాడు జార్జి శాంప్సన్. సొదుం జయరాం కూడా అంతే. ‘పుణ్యకాలం మించిపోయింది’ అన్న కథలో నాయకుడు గోపాలకృష్ణ కథా రచయితే. అతడి గురించి రాసిన మాటలు జయరాంకూ వర్తిస్తాయి. దీపావళి కథల పోటీకి రాయమని గోపాలకృష్ణ భార్య పోరు పెడుతుంది. బహుమతి …
పూర్తి వివరాలు