Tags :kadapa

    పర్యాటకం సమాచారం

    కడప నగరం

    కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

    కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది. కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

    ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

    కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    13న కడపలో ప్రాంగణ ఎంపికలు

    కడప: నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 13న ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు డాక్టరు ఎన్.సుబ్బనర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు వస్తున్నారన్నారు. ఆ బ్యాంకులో సేల్స్ ఆఫీసరు ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు అన్నీరకాల అర్హతాపత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.పూర్తి వివరాలు ...

    వార్తలు

    రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ

    కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్‌బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    కడప జిల్లాలో ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ – ఒక విన్నపం

    రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కడప జిల్లా పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడమూ, ముఖ్యమంత్రే ఈ జిల్లా గురించి విపరీత బుద్ధితో దుష్ప్రచారం చెయ్యడమూ అందరికీ తెలిసిన విషయాలే. DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల

    ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    పెద్దదర్గాలో నారా రోహిత్

    కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్‌పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.పూర్తి వివరాలు ...