Tags :kadapa

    వార్తలు

    జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి

    కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు అనిల్‌, మేనత్త కమలమ్మ, సొదరి విమలమ్మ, సోదరుడు సుధీకర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ పురుషోత్తంరెడ్డి, బావ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వదిన […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    కడప నగర ఖాజీగా సయ్యద్ నజీం అలీ షామిరి

    కడప:  సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు  మే 28న విడుదల చేసిన జీవో నంబరు 65లో పేర్కొన్నారు. 1880 నాటి ఖాజీల చట్టాన్ని అనుసరించి సయ్యద్ నజీం అలీ షామిరి మూడు సంవత్సరాల పాటు కడప నగర […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?

    శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనక జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతల ఆవశ్యకత ఎంత అనేది సెలవిచ్చారు. సంతోషం, ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల సమక్షంలో వారి మనసును రంజిపచేసే విషయాలు మాట్లాడి వారిని ఆకట్టుకున్నందుకు అభినందనలు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను గురించి తన […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

    కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ  రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు జిల్లాలోని 8 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. కడప డిపో నుంచి 25, రాజంపేట 30, ప్రొద్దుటూరు 15, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు డిపోల నుంచి పది బస్సుల చొప్పున మొత్తం 120 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఆర్టీసీ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

    కడప: నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు నీటి సమస్య ఎక్కువవుతోందని, కలుషిత నీటితో జనం రోగాలబారిన పడుతున్నారని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించకపోతే కార్పొరేషన్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఐదురోజులుగా సీపీఐ నాయకులు బృందాలుగా ఏర్పడి […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కినారు

    వేంపల్లె : సోమావారం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళనను విరమించేదిలేదని మధ్యాహ్న భోజనం చేయకుండా భీష్మించుకున్నారు. కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. మెస్‌లో భోజనం సరిగాలేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటీలోని కెఎంకే క్యాటరింగ్‌కు చెందిన మెస్‌లో సాంబారులో కప్పలు ప్రత్యక్షమయ్యాయని విద్యార్థులు అధికారులకు స్వయంగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘చంద్రబాబు మాట నిలుపుకోవాల’

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళన కడప: జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోవాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఊరికోమాట, రోజుకో ప్రకటన ఇవ్వడం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టటానికే చేస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు ఉన్న ప్రాంతంలో కాకుండా కర్నూలులో విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉర్దూ విశ్వవిద్యాలయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరగుతున్న […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

    మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

    కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే […]పూర్తి వివరాలు ...