దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తుల జయజయధ్వానాల నడుమ దేవదేవుడు ఊరేగినారు.పూర్తి వివరాలు ...
Tags :devuni kadapa
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో నాలుగోరోజు శుక్రవారం నాటి ఉత్సవాలు… ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగింపు ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం హనుమంత వాహనం పై ఊరేగింపుపూర్తి వివరాలు ...
దేవుని కడప: శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం కడపరాయడు సింహవాహనం, సూర్యప్రభ వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం లోకకల్యాణం కోసం నిత్యహోమాలు జరిగాయి. అనంతరం సూర్యప్రభ వాహనంపైన స్వామి దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయమూ, సాయంత్రం శ్రీనివాసునికి భక్తుల సమక్షంలో వూంజల్‌సేవ నిర్వహించినారు. మంగళహారతుల అనంతరం స్వామి సింహవాహనంపై కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వచ్చారు. కడపరాయని బ్రహ్మోత్సవాలలో భాగంగా తితిదే ధర్మప్రచారపరిషత్తు […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి కార్యక్రమాలు… ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు. పూర్తి వివరాలు ...
దేవుని కడప: కడప రాయడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగినాయి. భక్తుల గోవింద నామస్మరణలతో దేవుని కడప మార్మోగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం తిరుచ్చి గ్రామోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించినారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు శేషవాహనం పైన దేవిని కడప వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం తితిదే తిరుచానూరు నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకోత్సవం నిర్వహించినారు. దివ్య అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి […]పూర్తి వివరాలు ...
కడప: దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం దీక్షాతిరుమంజనం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శోభ వచ్చింది. వాస్తుహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. రాత్రి శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో తితిదే డిప్యూటీ ఈవో బాలాజీ ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు – తిరుచ్చి ధ్వజారోహణం 10.30 గంటలకు – స్నపన […]పూర్తి వివరాలు ...
వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు. వైకుంఠ ఏకాదశి అంటే? ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు […]పూర్తి వివరాలు ...
కడప: శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.పూర్తి వివరాలు ...
‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం […]పూర్తి వివరాలు ...