దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన మరుసటి రోజున స్వామి వారికి పుష్పయాగం చేస్తారు. బ్రహ్మోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి వివరాలు ...
Tags :దేవుని కడప బ్రహ్మోత్సవాలు
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణంపూర్తి వివరాలు ...
దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వూంజల్‌సేవను తిలకించి భక్తులు తరించారు.పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం […]పూర్తి వివరాలు ...
దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తుల జయజయధ్వానాల నడుమ దేవదేవుడు ఊరేగినారు.పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో నాలుగోరోజు శుక్రవారం నాటి ఉత్సవాలు… ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగింపు ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం హనుమంత వాహనం పై ఊరేగింపుపూర్తి వివరాలు ...
దేవుని కడప: శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం కడపరాయడు సింహవాహనం, సూర్యప్రభ వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం లోకకల్యాణం కోసం నిత్యహోమాలు జరిగాయి. అనంతరం సూర్యప్రభ వాహనంపైన స్వామి దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయమూ, సాయంత్రం శ్రీనివాసునికి భక్తుల సమక్షంలో వూంజల్‌సేవ నిర్వహించినారు. మంగళహారతుల అనంతరం స్వామి సింహవాహనంపై కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వచ్చారు. కడపరాయని బ్రహ్మోత్సవాలలో భాగంగా తితిదే ధర్మప్రచారపరిషత్తు […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి కార్యక్రమాలు… ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు. పూర్తి వివరాలు ...
దేవుని కడప: కడప రాయడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగినాయి. భక్తుల గోవింద నామస్మరణలతో దేవుని కడప మార్మోగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం తిరుచ్చి గ్రామోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించినారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు శేషవాహనం పైన దేవిని కడప వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం తితిదే తిరుచానూరు నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకోత్సవం నిర్వహించినారు. దివ్య అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి […]పూర్తి వివరాలు ...